Job (Telugu)

Job (Telugu)

1

1:1b.JOB.001.001 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

1:2b.JOB.001.002 అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తె లును కలిగిరి.

1:3b.JOB.001.003 అతనికి ఏడువేల గొఱ్ఱలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.

1:4b.JOB.001.004 అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.

1:5b.JOB.001.005 వారి వారి విందుదిన ములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

1:6b.JOB.001.006 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది2 యగు వాడు వారితో కలిసి వచ్చెను.

1:7b.JOB.001.007 యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాదిభూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.

1:8b.JOB.001.008 అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.

1:9b.JOB.001.009 అని అడుగగా అపవాదియోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?

1:10b.JOB.001.010 నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

1:11b.JOB.001.011 అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

1:12b.JOB.001.012 యెహోవాఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.

1:13b.JOB.001.013 ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి

1:14b.JOB.001.014 ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి

1:15b.JOB.001.015 ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.

1:16b.JOB.001.016 అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకా శమునుండి పడి గొఱ్ఱలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

1:17b.JOB.001.017 అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చికల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.

1:18b.JOB.001.018 అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చినీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయు చుండగా

1:19b.JOB.001.019 గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది ¸°వనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.

1:20b.JOB.001.020 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను

1:21b.JOB.001.021 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలు గునుగాక.

1:22b.JOB.001.022 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

2

2:1b.JOB.002.001 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.

2:2b.JOB.002.002 యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచ రించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

2:3b.JOB.002.003 అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతు డునై దేవునియందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జిం చిన వాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా

2:4b.JOB.002.004 అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

2:5b.JOB.002.005 ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.

2:6b.JOB.002.006 అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.

2:7b.JOB.002.007 కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.

2:8b.JOB.002.008 అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా

2:9b.JOB.002.009 అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.

2:10b.JOB.002.010 అందుకతడుమూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.

2:11b.JOB.002.011 తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.

2:12b.JOB.002.012 వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను లెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి.

2:13b.JOB.002.013 అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.

3

3:1b.JOB.003.001 ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.

3:2b.JOB.003.002 యోబు ఈలాగు అనెను

3:3b.JOB.003.003 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాకమగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

3:4b.JOB.003.004 ఆ దినము అంధకారమగును గాకపైనుండి దేవుడు దాని నెంచకుండును గాకవెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక

3:5b.JOB.003.005 చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక.మేఘము దాని కమ్మును గాకపగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక

3:6b.JOB.003.006 అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాకసంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాకమాసముల సంఖ్యలో అది చేరకుండును గాక.

3:7b.JOB.003.007 ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాకదానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక

3:8b.JOB.003.008 దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాకభుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించు దురు గాక.

3:9b.JOB.003.009 అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాకవెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక

3:10b.JOB.003.010 అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని?

3:11b.JOB.003.011 గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?

3:12b.JOB.003.012 మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని?

3:13b.JOB.003.013 లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందునునేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును

3:14b.JOB.003.014 తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.

3:15b.JOB.003.015 బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందును.

3:16b.JOB.003.016 అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును.వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.

3:17b.JOB.003.017 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు

3:18b.JOB.003.018 బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు

3:19b.JOB.003.019 అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారుదాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు.

3:20b.JOB.003.020 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?

3:21b.JOB.003.021 వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.

3:22b.JOB.003.022 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.

3:23b.JOB.003.023 మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?

3:24b.JOB.003.024 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

3:25b.JOB.003.025 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.

3:26b.JOB.003.026 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.

4

4:1b.JOB.004.001 దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

4:2b.JOB.004.002 ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?

4:3b.JOB.004.003 అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు.

4:4b.JOB.004.004 నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను.క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.

4:5b.JOB.004.005 అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.

4:6b.JOB.004.006 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?

4:7b.JOB.004.007 జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?

4:8b.JOB.004.008 నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.

4:9b.JOB.004.009 దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.

4:10b.JOB.004.010 సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును.కొదమ సింహముల కోరలును విరిగిపోవును.

4:11b.JOB.004.011 ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.

4:12b.JOB.004.012 నా కొకమాట రహస్యముగా తెలుపబడెనునా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను.

4:13b.JOB.004.013 గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

4:14b.JOB.004.014 భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.

4:15b.JOB.004.015 ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను.

4:16b.JOB.004.016 అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెనుమెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగాదేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?

4:17b.JOB.004.017 తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?

4:18b.JOB.004.018 ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.

4:19b.JOB.004.019 జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

4:20b.JOB.004.020 ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురుఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.

4:21b.JOB.004.021 వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధికలుగకయే మృతినొందుదురు.ఆలాగుననే జరుగుచున్నది గదా.

5

5:1b.JOB.005.001 నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్దదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?

5:2b.JOB.005.002 దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశిం చెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.

5:3b.JOB.005.003 మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని.

5:4b.JOB.005.004 అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.

5:5b.JOB.005.005 ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి

5:6b.JOB.005.006 శ్రమ ధూళిలోనుండి పుట్టదు.బాధ భూమిలోనుండి మొలవదు.

5:7b.JOB.005.007 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవము నకే పుట్టుచున్నారు.

5:8b.JOB.005.008 అయితే నేను దేవుని నాశ్రయించుదును.దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.

5:9b.JOB.005.009 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.

5:10b.JOB.005.010 ఆయన భూమిమీద వర్షము కురిపించువాడుపొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.

5:11b.JOB.005.011 అట్లు ఆయన దీనులను ఉన్నతస్థలములలో నుంచునుదుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.

5:12b.JOB.005.012 వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండఆయన వారి ఉపాయములను భంగపరచును

5:13b.JOB.005.013 జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనునుకపటుల ఆలోచనను తలక్రిందుచేయును

5:14b.JOB.005.014 పగటివేళ వారికి అంధకారము తారసిల్లునురాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడువులాడుదురు

5:15b.JOB.005.015 బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండిఆయన దరిద్రులను రక్షించును.

5:16b.JOB.005.016 కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును.

5:17b.JOB.005.017 దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.

5:18b.JOB.005.018 ఆయన గాయపరచి గాయమును కట్టునుఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.

5:19b.JOB.005.019 ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించునుఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

5:20b.JOB.005.020 క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలమునుండియు ఆయన నిన్ను తప్పించును.

5:21b.JOB.005.021 నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయునుప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.

5:22b.JOB.005.022 పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.

5:23b.JOB.005.023 ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు

5:24b.JOB.005.024 నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండునునీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు.

5:25b.JOB.005.025 మరియు నీ సంతానము విస్తారమగుననియునీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును.

5:26b.JOB.005.026 వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లుపూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.

5:27b.JOB.005.027 మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.

6

6:1b.JOB.006.001 ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను

6:2b.JOB.006.002 నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక.

6:3b.JOB.006.003 ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రములఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.

6:4b.JOB.006.004 సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.

6:5b.JOB.006.005 అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?

6:6b.JOB.006.006 ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?

6:7b.JOB.006.007 నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.

6:8b.JOB.006.008 ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాకనేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక

6:9b.JOB.006.009 దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.

6:10b.JOB.006.010 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును

6:11b.JOB.006.011 నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?

6:12b.JOB.006.012 నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా?

6:13b.JOB.006.013 నాలో త్రాణ యేమియు లేదు గదా.శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.

6:14b.JOB.006.014 క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనిననుస్నేహితుడు వానికి దయచూపతగును.

6:15b.JOB.006.015 నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.

6:16b.JOB.006.016 మంచుగడ్డలుండుటవలననుహిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును

6:17b.JOB.006.017 వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.

6:18b.JOB.006.018 వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును.

6:19b.JOB.006.019 సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురుషేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.

6:20b.JOB.006.020 వారు వాటిని నమి్మనందుకు అవమానమొందుదురువాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.

6:21b.JOB.006.021 అటువలె మీరు లేనట్టుగానే యున్నారుమీరు ఆపదను చూచి భయపడుచున్నారు.

6:22b.JOB.006.022 ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?

6:23b.JOB.006.023 పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడనియడిగితినా?

6:24b.JOB.006.024 నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదనుఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకుతెలియజేయుడి.

6:25b.JOB.006.025 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

6:26b.JOB.006.026 మాటలను గద్దించుదమని మీరనుకొందురా?నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.

6:27b.JOB.006.027 మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,మీ స్నేహితులమీద బేరము సాగింతురు.

6:28b.JOB.006.028 దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?

6:29b.JOB.006.029 అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడిమరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

6:30b.JOB.006.030 నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?

7

7:1b.JOB.007.001 భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా?వారి దినములు కూలివాని దినములవంటివి కావా?

7:2b.JOB.007.002 నీడను మిగుల నపేక్షించు దాసునివలెనుకూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను

7:3b.JOB.007.003 ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను.ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి.నేను పండుకొనునప్పుడెల్ల

7:4b.JOB.007.004 ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును.తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడు దును.

7:5b.JOB.007.005 నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్ప బడియున్నది.నా చర్మము మాని మరల పగులుచున్నది.

7:6b.JOB.007.006 నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించు చున్నవినిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.

7:7b.JOB.007.007 నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము.నా కన్ను ఇకను మేలు చూడదు.

7:8b.JOB.007.008 నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు.నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.

7:9b.JOB.007.009 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లుపాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు

7:10b.JOB.007.010 అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.

7:11b.JOB.007.011 కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

7:12b.JOB.007.012 నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు?

7:13b.JOB.007.013 నా మంచము నాకు ఆదరణ ఇచ్చును.నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా

7:14b.JOB.007.014 నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవుదర్శనములవలన నన్ను భయపెట్టెదవు.

7:15b.JOB.007.015 కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.

7:16b.JOB.007.016 అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.

7:17b.JOB.007.017 మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?

7:18b.JOB.007.018 ప్రతి పగలు నీవతని దర్శింపనేల?ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?

7:19b.JOB.007.019 ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?

7:20b.JOB.007.020 నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?

7:21b.JOB.007.021 నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.

8

8:1b.JOB.008.001 అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను

8:2b.JOB.008.002 ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.

8:3b.JOB.008.003 దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?

8:4b.JOB.008.004 నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోకావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.

8:5b.JOB.008.005 నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల

8:6b.JOB.008.006 నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.

8:7b.JOB.008.007 అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.

8:8b.JOB.008.008 మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.

8:9b.JOB.008.009 మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.

8:10b.JOB.008.010 వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.

8:11b.JOB.008.011 బురద లేకుండ జమ్ము పెరుగునా?నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?

8:12b.JOB.008.012 అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.

8:13b.JOB.008.013 దేవుని మరచువారందరి గతి అట్లే ఉండునుభక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.

8:14b.JOB.008.014 అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.

8:15b.JOB.008.015 అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.

8:16b.JOB.008.016 అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును.ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును.

8:17b.JOB.008.017 అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనునురాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును.

8:18b.JOB.008.018 దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.

8:19b.JOB.008.019 ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.

8:20b.JOB.008.020 ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు.ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.

8:21b.JOB.008.021 నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురుదుష్టుల గుడారము ఇక నిలువకపోవును.

8:22b.JOB.008.022 అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును.ప్రహర్షముతో నీ పెదవులను నింపును.

9

9:1b.JOB.009.001 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

9:2b.JOB.009.002 వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?

9:3b.JOB.009.003 వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.

9:4b.JOB.009.004 ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

9:5b.JOB.009.005 వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనేఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే

9:6b.JOB.009.006 భూమిని దాని స్థలములో నుండి కదలించువాడుఆయనేదాని స్తంభములు అదరచేయువాడు ఆయనే

9:7b.JOB.009.007 ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడుఆయన నక్షత్రములను మరుగుపరచును.

9:8b.JOB.009.008 ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడుసముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.

9:9b.JOB.009.009 ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు.

9:10b.JOB.009.010 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.

9:11b.JOB.009.011 ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేనునా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

9:12b.JOB.009.012 ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?

9:13b.JOB.009.013 దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

9:14b.JOB.009.014 కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

9:15b.JOB.009.015 నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలనున్యాయకర్తయని1 నేనాయనను బతిమాలుకొనదగును.

9:16b.JOB.009.016 నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చిననుఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

9:17b.JOB.009.017 ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడునిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు

9:18b.JOB.009.018 ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.

9:19b.JOB.009.019 బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగానేనే యున్నానని ఆయన యనునున్యాయవిధినిగూర్చి వాదము కలుగగాప్రతివాదిగానుండ తెగించువాడెవడని ఆయన యనును?

9:20b.JOB.009.020 నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపునునేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.

9:21b.JOB.009.021 నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.ఏమి చేసినను ఒక్కటే.

9:22b.JOB.009.022 కావునయథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.

9:23b.JOB.009.023 సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనముచేయగానిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.

9:24b.JOB.009.024 భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును.ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరిఎవడు?

9:25b.JOB.009.025 పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగాగతించుచున్నవిక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.

9:26b.JOB.009.026 రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.

9:27b.JOB.009.027 నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?

9:28b.JOB.009.028 నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను

9:29b.JOB.009.029 నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?

9:30b.JOB.009.030 నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను

9:31b.JOB.009.031 నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.

9:32b.JOB.009.032 ఆయన నావలె నరుడు కాడునేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుమేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.

9:33b.JOB.009.033 మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.

9:34b.JOB.009.034 ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.

9:35b.JOB.009.035 అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొను చున్నాను.

10

10:1b.JOB.010.001 నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినదినేను అడ్డులేకుండ అంగలార్చెదనునా మనోవ్యాకులము కొలది నేను పలికెదను

10:2b.JOB.010.002 నా మీద నేరము మోపకుండుమునీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.

10:3b.JOB.010.003 దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

10:4b.JOB.010.004 నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?

10:5b.JOB.010.005 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములవంటివా?

10:6b.JOB.010.006 నేను దోషిని కాననియునీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు

10:7b.JOB.010.007 నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?

10:8b.JOB.010.008 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్ననునీవు నన్ను మింగివేయుచున్నావు.

10:9b.JOB.010.009 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

10:10b.JOB.010.010 ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదాజున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.

10:11b.JOB.010.011 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివిఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.

10:12b.JOB.010.012 జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివినీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.

10:13b.JOB.010.013 అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివిఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.

10:14b.JOB.010.014 నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు.

10:15b.JOB.010.015 నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగునునేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొనినాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

10:16b.JOB.010.016 ­నేను సంతోషించినయెడలఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.

10:17b.JOB.010.017 సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవుఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవుఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.

10:18b.JOB.010.018 గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు;

10:19b.JOB.010.019 అప్పుడు నేను లేనట్లే యుండియుందునుగర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

10:20b.JOB.010.020 నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

10:21b.JOB.010.021 అంధకారము మరణాంధకారముగల దేశమునకు

10:22b.JOB.010.022 కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకుభ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకువెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందుకొంతసేపు నేను తెప్పరిల్లునట్లునన్ను విడిచి నా జోలికి రాకుండుము.

11

11:1b.JOB.011.001 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను

11:2b.JOB.011.002 ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా.వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?

11:3b.JOB.011.003 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?

11:4b.JOB.011.004 నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.

11:5b.JOB.011.005 దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు

11:6b.JOB.011.006 ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువునీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.

11:7b.JOB.011.007 దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?

11:8b.JOB.011.008 అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?

11:9b.JOB.011.009 దాని పరిమాణము బ ³ూమికంటె అధికమైనదిదాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది

11:10b.JOB.011.010 ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసివ్యాజ్యెమాడ పిలిచినప్పుడుఆయన నడ్డగింప గలవాడెవడు?

11:11b.JOB.011.011 పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదాపరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదోఆయనే తెలిసికొనును గదా.

11:12b.JOB.011.012 అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగానిబుద్ధిహీనుడు వివేకికాడు.

11:13b.JOB.011.013 నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడలనీ చేతులు ఆయనవైపు చాపినయెడల

11:14b.JOB.011.014 పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచినయెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల

11:15b.JOB.011.015 నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవునిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.

11:16b.JOB.011.016 నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవుదాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లునీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.

11:17b.JOB.011.017 అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించునుచీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.

11:18b.JOB.011.018 నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు.నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు.

11:19b.JOB.011.019 ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు.

11:20b.JOB.011.020 దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదుప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.

12

12:1b.JOB.012.001 అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తర...మిచ్చెను

12:2b.JOB.012.002 నిజముగా లోకములో మీరే జనులుమీతోనే జ్ఞానము గతించి పోవును.

12:3b.JOB.012.003 అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నదినేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కానుమీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు?దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను

12:4b.JOB.012.004 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

12:5b.JOB.012.005 దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు.కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

12:6b.JOB.012.006 దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లునుదేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగానుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.

12:7b.JOB.012.007 అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించునుఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.

12:8b.JOB.012.008 భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించునుసముద్రములోని చేపలును నీకు దాని వివరించును

12:9b.JOB.012.009 వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడలయెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు?

12:10b.JOB.012.010 జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

12:11b.JOB.012.011 అంగిలి ఆహారమును రుచి చూచునట్లుచెవి మాటలను పరీక్షింపదా?

12:12b.JOB.012.012 వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు

12:13b.JOB.012.013 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవిఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

12:14b.JOB.012.014 ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరుఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.

12:15b.JOB.012.015 ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవునువాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.

12:16b.JOB.012.016 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావలక్షణములుమోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశ మున నున్నారు.

12:17b.JOB.012.017 ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును.న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.

12:18b.JOB.012.018 రాజుల అధికారమును ఆయన కొట్టివేయునువారి నడుములకు గొలుసులు కట్టును.

12:19b.JOB.012.019 యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొని పోవునుస్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.

12:20b.JOB.012.020 వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయునుపెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.

12:21b.JOB.012.021 అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.

12:22b.JOB.012.022 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచుమరణాంధకారమును వెలుగులోనికి రప్పించును

12:23b.JOB.012.023 జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయునుసరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.

12:24b.JOB.012.024 భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచునుత్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.

12:25b.JOB.012.025 వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురుమత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.

13

13:1b.JOB.013.001 ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను.నా చెవి దాని విని గ్రహించియున్నది

13:2b.JOB.013.002 మీకు తెలిసినది నాకును తెలిసేయున్నదినేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.

13:3b.JOB.013.003 నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నానుదేవునితోనే వాదింప గోరుచున్నాను

13:4b.JOB.013.004 మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు.

13:5b.JOB.013.005 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

13:6b.JOB.013.006 దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెమునాలకించుడి.

13:7b.JOB.013.007 దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

13:8b.JOB.013.008 ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?

13:9b.JOB.013.009 ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరుఆయనను మోసముచేయుదురా?

13:10b.JOB.013.010 మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడలనిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.

13:11b.JOB.013.011 ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా?ఆయన భయము మీ మీదికి రాదా?

13:12b.JOB.013.012 మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.మీ వాదములు మంటివాదములు

13:13b.JOB.013.013 నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడినామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.

13:14b.JOB.013.014 నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను

13:15b.JOB.013.015 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.

13:16b.JOB.013.016 ఇదియు నాకు రక్షణార్థమైనదగునుభక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.

13:17b.JOB.013.017 నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడినా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి.

13:18b.JOB.013.018 ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నానునేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.

13:19b.JOB.013.019 నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు?ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొనిప్రాణము విడిచెదను.

13:20b.JOB.013.020 ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.

13:21b.JOB.013.021 నీ చెయ్యి నామీదనుండి తొలగింపుమునీ భయము నన్ను బెదరింపనీయకుము

13:22b.JOB.013.022 అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము

13:23b.JOB.013.023 నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.

13:24b.JOB.013.024 నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?

13:25b.JOB.013.025 ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవువేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా?

13:26b.JOB.013.026 నీవు నాకు కఠినమైన శిక్ష విధించి యున్నావునా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగానీవు విధించియున్నావు

13:27b.JOB.013.027 బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు

13:28b.JOB.013.028 మురిగి క్షీణించుచున్న వానిచుట్టుచిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టుగిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.

14

14:1b.JOB.014.001 స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును.

14:2b.JOB.014.002 పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవునునీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.

14:3b.JOB.014.003 అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావుతీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు.

14:4b.JOB.014.004 పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగినఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.

14:5b.JOB.014.005 నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలసంఖ్య నీకు తెలిసేయున్నది.మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు

14:6b.JOB.014.006 కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము.

14:7b.JOB.014.007 వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియుదానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.

14:8b.JOB.014.008 దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను

14:9b.JOB.014.009 నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చునులేత మొక్కవలె అది కొమ్మలు వేయును.

14:10b.JOB.014.010 అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు?

14:11b.JOB.014.011 తటాక జలములు ఎట్లు ఇంకిపోవునోనది నీరు ఎట్లు ఎండి హరించిపోవునోఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.

14:12b.JOB.014.012 ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

14:13b.JOB.014.013 నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు చున్నాను.

14:14b.JOB.014.014 మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకునా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును

14:15b.JOB.014.015 ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యు త్తరమిచ్చెదనునీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.

14:16b.JOB.014.016 అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావునా పాపమును సహింపలేకయున్నావు

14:17b.JOB.014.017 నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నదినేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.

14:18b.JOB.014.018 పర్వతమైనను పడిపోయి నాశనమగునుకొండయైనను దాని స్థానము తప్పును.

14:19b.JOB.014.019 జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవునునీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.

14:20b.JOB.014.020 నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురునీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు.

14:21b.JOB.014.021 వారి కుమారులు ఒకవేళ షునత వహించినను అదివారికి తెలియకపోవును.వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపకయుందురు.

14:22b.JOB.014.022 తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురుతమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.

15

15:1b.JOB.015.001 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను

15:2b.JOB.015.002 జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా?తూర్పుగాలితో తన కడుపు నింపుకొన దగునా?

15:3b.JOB.015.003 వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా?నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా?

15:4b.JOB.015.004 నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు.దేవునిగూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.

15:5b.JOB.015.005 నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది.వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

15:6b.JOB.015.006 నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవినీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.

15:7b.JOB.015.007 మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?

15:8b.JOB.015.008 నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా?నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?

15:9b.JOB.015.009 మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు?మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?

15:10b.JOB.015.010 నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సుమీరిన పురుషులును మాలో నున్నారునీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.

15:11b.JOB.015.011 దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా?ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యముతేలికగా నున్నదా?

15:12b.JOB.015.012 నీ హృదయము ఏల క్రుంగిపోయెను?నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?

15:13b.JOB.015.013 దేవునిమీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?

15:14b.JOB.015.014 శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

15:15b.JOB.015.015 ఆలోచించుము ఆయన తన దూతలయందు నమి్మకయుంచడు.ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

15:16b.JOB.015.016 అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లుత్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అప విత్రుడు గదా.

15:17b.JOB.015.017 నా మాట ఆలకింపుము నీకు తెలియజేతునునేను చూచినదానిని నీకు వివరించెదను.

15:18b.JOB.015.018 జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.

15:19b.JOB.015.019 అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

15:20b.JOB.015.020 తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందునుహింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడుబాధనొందును.

15:21b.JOB.015.021 భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.

15:22b.JOB.015.022 తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.

15:23b.JOB.015.023 అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.

15:24b.JOB.015.024 శ్రమయు వేదనయు వానిని బెదరించును.యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును.

15:25b.JOB.015.025 వాడు దేవునిమీదికి చేయి చాపునుసర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.

15:26b.JOB.015.026 మూర్ఖుడై ఆయనను మార్కొనునుతన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.

15:27b.JOB.015.027 వాని ముఖము క్రొవ్వు పట్టియున్నదివాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.

15:28b.JOB.015.028 అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురుఎవరును నివసింపకూడని యిండ్లలోదిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు

15:29b.JOB.015.029 కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు.వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు

15:30b.JOB.015.030 వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించునుదేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.

15:31b.JOB.015.031 వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయినవారుమాయయే వారికి ఫలమగును.

15:32b.JOB.015.032 వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.

15:33b.JOB.015.033 ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును.ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారినిాల్చును.

15:34b.JOB.015.034 భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును.లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును

15:35b.JOB.015.035 వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.

16

16:1b.JOB.016.001 అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

16:2b.JOB.016.002 ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నానుమీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.

16:3b.JOB.016.003 ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?

16:4b.JOB.016.004 నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాటలాడవచ్చును.నేనును మీమీద మాటలు కల్పింపవచ్చునుమీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును.

16:5b.JOB.016.005 అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల పరచుదునునా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును

16:6b.JOB.016.006 నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదునేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును?

16:7b.JOB.016.007 ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడునా బంధువర్గమంతయు నీవు పాడు చేసియున్నావు

16:8b.JOB.016.008 నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు.ఇదికూడ నామీద సాక్ష్యముగా నున్నదినా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.

16:9b.JOB.016.009 ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను.ఆయన నామీద పండ్లు కొరుకుచుండెనునాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.

16:10b.JOB.016.010 జనులు నామీద తమ నోరు తెరతురునన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు.వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు

16:11b.JOB.016.011 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడుభక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు.

16:12b.JOB.016.012 నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్నుముక్కలు చెక్కలు చేసియున్నాడుమెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసి యున్నాడు.తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

16:13b.JOB.016.013 ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవికనికరములేక నా తుండ్లను పొడిచెనునా పైత్యరసమును నేలను పారబోసెను.

16:14b.JOB.016.014 కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెనుపరుగులెత్తి శూరునివలె నామీద పడెను.

16:15b.JOB.016.015 నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటినినా కొమ్మును ధూళితో మురికిచేసితిని.

16:16b.JOB.016.016 నాచేత బలాత్కారము జరుగకపోయిననునా ప్రార్థన యథార్థముగా నుండినను

16:17b.JOB.016.017 ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నదినా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.

16:18b.JOB.016.018 భూమీ, నా రక్తమును కప్పివేయకుమునా మొఱ్ఱకు విరామము కలుగకుండునుగాక.

16:19b.JOB.016.019 ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములోనున్నాడునా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు.

16:20b.JOB.016.020 నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు.నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు

16:21b.JOB.016.021 నర పుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరినేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.

16:22b.JOB.016.022 కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్లుదును.

17

17:1b.JOB.017.001 నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను...సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.

17:2b.JOB.017.002 ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారువారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.

17:3b.JOB.017.003 ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుముమరి యెవడు నా నిమిత్తము పూటపడును?

17:4b.JOB.017.004 నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివికావున నీవు వారిని హెచ్చింపవు.

17:5b.JOB.017.005 ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునోవాని పిల్లల కన్నులు క్షీణించును.

17:6b.JOB.017.006 ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమి్మవేయుదురు.

17:7b.JOB.017.007 నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెనునా అవయవములన్నియు నీడవలె ఆయెను

17:8b.JOB.017.008 యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురునిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.

17:9b.JOB.017.009 అయితే నీతిమంతులు తమ మార్గమును విడువకప్రవర్తించుదురునిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

17:10b.JOB.017.010 మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.

17:11b.JOB.017.011 నా దినములు గతించెనునా యోచన నిరర్థకమాయెనునా హృదయ వాంఛ భంగమాయెను.

17:12b.JOB.017.012 రాత్రి పగలనియుచీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.

17:13b.JOB.017.013 ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకుఇల్లు అను ఆశయే.చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను

17:14b.JOB.017.014 నీవు నాకు తండ్రివని గోతితోనునీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేనుమనవి చేయుచున్నాను.

17:15b.JOB.017.015 నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?

17:16b.JOB.017.016 ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.

18

18:1b.JOB.018.001 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను

18:2b.JOB.018.002 మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు?మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.

18:3b.JOB.018.003 మీ దృష్టికి మృగములుగానుమూఢులుగాను మేమెంచబడుట ఏల?

18:4b.JOB.018.004 కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా,నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా?నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?

18:5b.JOB.018.005 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.

18:6b.JOB.018.006 వారి గుడారములో వెలుగు అంధకారమగునువారియొద్దనున్న దీపము ఆరిపోవును

18:7b.JOB.018.007 వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడునువారి స్వకీయాలోచన వారిని కూల్చును.

18:8b.JOB.018.008 వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.

18:9b.JOB.018.009 బోను వారి మడిమెను పట్టుకొనునువల వారిని చిక్కించుకొనును.

18:10b.JOB.018.010 వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడునువారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.

18:11b.JOB.018.011 నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయునుభయములు వారిని వెంటాడి తరుమును.

18:12b.JOB.018.012 వారి బలము క్షీణించిపోవునువారిని కూల్చుటకు ఆపద కాచియుండును.

18:13b.JOB.018.013 అది వారి దేహ అవయవములను భక్షించునుమరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును.

18:14b.JOB.018.014 వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.

18:15b.JOB.018.015 వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము చేయుదురువారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.

18:16b.JOB.018.016 క్రింద వారి వేళ్లు ఎండిపోవునుపైన వారి కొమ్మలు నరకబడును.

18:17b.JOB.018.017 భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరుమైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.

18:18b.JOB.018.018 జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురుభూలోకములోనుండి వారిని తరుముదురు.

18:19b.JOB.018.019 వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైననుఉండరువారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడుఒకడైనను ఉండడు.

18:20b.JOB.018.020 తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచివిస్మయమొందుదురుపూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు.

18:21b.JOB.018.021 నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టునుదేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.

19

19:1b.JOB.019.001 అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

19:2b.JOB.019.002 ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?

19:3b.JOB.019.003 పదిమారులు మీరు నన్ను నిందించితిరిసిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.

19:4b.JOB.019.004 నేను తప్పుచేసినయెడలనా తప్పు నా మీదికే వచ్చును గదా?

19:5b.JOB.019.005 మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా?నా నేరము నామీద మీరు మోపుదురా?

19:6b.JOB.019.006 ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియుతన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.

19:7b.JOB.019.007 నామీద బలాత్కారము జరుగుచున్నదని నేనుమొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదుసహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.

19:8b.JOB.019.008 నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు

19:9b.JOB.019.009 ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడుతలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.

19:10b.JOB.019.010 నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతినిఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.

19:11b.JOB.019.011 ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.

19:12b.JOB.019.012 ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారముచుట్టు దిగిరి.

19:13b.JOB.019.013 ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసియున్నాడునా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.

19:14b.JOB.019.014 నా బంధువులు నాయొద్దకు రాకయున్నారునా ప్రాణస్నేహితులునన్ను మరచిపోయియున్నారు.

19:15b.JOB.019.015 నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగాఎంచెదరునేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.

19:16b.JOB.019.016 నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడునేను వాని బతిమాలవలసి వచ్చెను.

19:17b.JOB.019.017 నా ఊపిరి నా భార్యకు అసహ్యమునేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.

19:18b.JOB.019.018 చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరునేను లేచుట చూచినయెడల బాలురు నామీదదూషణలు పలికెదరు.

19:19b.JOB.019.019 నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతినినేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.

19:20b.JOB.019.020 నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవిదంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది

19:21b.JOB.019.021 దేవుని హస్తము నన్ను మొత్తియున్నదినామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీదజాలిపడుడి.

19:22b.JOB.019.022 నా శరీరమాంసము పోవుట చాలుననుకొనకదేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుము దురు?

19:23b.JOB.019.023 నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను.

19:24b.JOB.019.024 అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.

19:25b.JOB.019.025 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాతఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

19:26b.JOB.019.026 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

19:27b.JOB.019.027 నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయననుచూచెదనునాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి

19:28b.JOB.019.028 జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొనిమీరుమేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల

19:29b.JOB.019.029 మీరు ఖడ్గమునకు భయపడుడితీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.

20

20:1b.JOB.020.001 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

20:2b.JOB.020.002 ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

20:3b.JOB.020.003 నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నం దుకునా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

20:4b.JOB.020.004 దుష్టులకు విజయము కొద్దికాలముండునుభక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును.

20:5b.JOB.020.005 ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలముమొదలుకొనిఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

20:6b.JOB.020.006 వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగిననుమేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

20:7b.JOB.020.007 తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారువారేమైరని యడుగుదురు.

20:8b.JOB.020.008 కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురురాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.

20:9b.JOB.020.009 వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

20:10b.JOB.020.010 వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరువారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.

20:11b.JOB.020.011 వారి యెముకలలో ¸°వనబలము నిండియుండునుగాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.

20:12b.JOB.020.012 చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.

20:13b.JOB.020.013 దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దానినుంచుకొనిరి.

20:14b.JOB.020.014 అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.

20:15b.JOB.020.015 వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు.

20:16b.JOB.020.016 వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.వారు కట్లపాముల విషమును పీల్చుదురునాగుపాము నాలుక వారిని చంపును.

20:17b.JOB.020.017 ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.

20:18b.JOB.020.018 దేనికొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరోదానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరువారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు

20:19b.JOB.020.019 వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.

20:20b.JOB.020.020 వారు ఎడతెగక ఆశించినవారుతమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మునుతాము రక్షించుకొనజాలరు.

20:21b.JOB.020.021 వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారిక్షేమస్థితి నిలువదు.

20:22b.JOB.020.022 వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురుదురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును.

20:23b.JOB.020.023 వారు కడుపు నింపుకొననైయుండగాదేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును.

20:24b.JOB.020.024 ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగాఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును.

20:25b.JOB.020.025 అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.

20:26b.JOB.020.026 వారి ధననిధులు అంధకారపూర్ణములగునుఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయునువారి గుడారములో మిగిలినదానిని అది కాల్చివేయును.

20:27b.JOB.020.027 ఆకాశము వారి దోషమును బయలుపరచునుభూమి వారిమీదికి లేచును.

20:28b.JOB.020.028 వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవునుదేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.

20:29b.JOB.020.029 ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగముదేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.

21

21:1b.JOB.021.001 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

21:2b.JOB.021.002 నా మాట మీరు జాగ్రత్తగా వినుడినా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

21:3b.JOB.021.003 నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదనునేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యముచేయవచ్చును.

21:4b.JOB.021.004 నేను మనుష్యునిగురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?

21:5b.JOB.021.005 నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడినోటిమీద చేయి వేసికొనుడి.

21:6b.JOB.021.006 నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.

21:7b.JOB.021.007 భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?

21:8b.JOB.021.008 వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.

21:9b.JOB.021.009 వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవిదేవుని దండము వారిమీద పడుట లేదు.

21:10b.JOB.021.010 వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.

21:11b.JOB.021.011 వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు.

21:12b.JOB.021.012 తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురుసానికనాదము విని సంతోషించుదురు.

21:13b.JOB.021.013 వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురుఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.

21:14b.JOB.021.014 వారునీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదునీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.

21:15b.JOB.021.015 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు

21:16b.JOB.021.016 వారి క్షేమము వారి చేతిలో లేదుభక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.

21:17b.JOB.021.017 భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.

21:18b.JOB.021.018 వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెనుగాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లుఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

21:19b.JOB.021.019 వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక

21:20b.JOB.021.020 వారే కన్నులార తమ నాశనమును చూతురుగాకసర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక.తమ జీవితకాలము సమాప్తమైన తరువాత

21:21b.JOB.021.021 తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికిచింత ఏమి?

21:22b.JOB.021.022 ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా?పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.

21:23b.JOB.021.023 ఒకడు తన కడవలలో పాలు నిండియుండగనుతన యెముకలలో మూలుగ బలిసియుండగను

21:24b.JOB.021.024 సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండుఆయుష్యముతో మృతినొందును

21:25b.JOB.021.025 వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖముగలవాడై మృతినొందును.

21:26b.JOB.021.026 వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.

21:27b.JOB.021.027 మీ తలంపులు నేనెరుగుదునుమీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.

21:28b.JOB.021.028 అధిపతుల మందిరము ఎక్కడ నున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.

21:29b.JOB.021.029 దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా?

21:30b.JOB.021.030 అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.

21:31b.JOB.021.031 వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు?

21:32b.JOB.021.032 వారు సమాధికి తేబడుదురుసమాధి శ్రద్ధగా కావలికాయబడును

21:33b.JOB.021.033 పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవిమనుష్యులందరు వారివెంబడి పోవుదురుఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి.

21:34b.JOB.021.034 మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్నుఓదార్చ జూచెదరు?

22

22:1b.JOB.022.001 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను

22:2b.JOB.022.002 నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు;బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు

22:3b.JOB.022.003 నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా?నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభ కరమా?

22:4b.JOB.022.004 ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునా?నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?

22:5b.JOB.022.005 నీ చెడుతనము గొప్పది కాదా?నీ దోషములు మితిలేనివి కావా?

22:6b.JOB.022.006 ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివివస్త్రహీనుల బట్టలను తీసికొంటివి

22:7b.JOB.022.007 దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివిఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.

22:8b.JOB.022.008 బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించునుఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును.

22:9b.JOB.022.009 విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివితండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.

22:10b.JOB.022.010 కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవిఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది.

22:11b.JOB.022.011 నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా?

22:12b.JOB.022.012 దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి?

22:13b.JOB.022.013 దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?

22:14b.JOB.022.014 గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి,ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.

22:15b.JOB.022.015 పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?

22:16b.JOB.022.016 వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.

22:17b.JOB.022.017 ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను

22:18b.JOB.022.018 మాయొద్దనుండి తొలగిపొమ్మనియుసర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు.భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక.

22:19b.JOB.022.019 మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియువారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు

22:20b.JOB.022.020 నీతిమంతులు దాని చూచి సంతోషించుదురునిర్దోషులు వారిని హేళనచేయుదురు.

22:21b.JOB.022.021 ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును.

22:22b.JOB.022.022 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుముఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.

22:23b.JOB.022.023 సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగాతొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.

22:24b.JOB.022.024 మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణ మును పారవేయుము

22:25b.JOB.022.025 అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును.

22:26b.JOB.022.026 అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.

22:27b.JOB.022.027 నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.

22:28b.JOB.022.028 మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.

22:29b.JOB.022.029 నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును.

22:30b.JOB.022.030 నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.

23

23:1b.JOB.023.001 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

23:2b.JOB.023.002 నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది

23:3b.JOB.023.003 ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగాఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.

23:4b.JOB.023.004 ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదనువాదములతో నా నోరు నింపుకొనెదను.

23:5b.JOB.023.005 ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అదినేను తెలిసికొందునుఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.

23:6b.JOB.023.006 ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును

23:7b.JOB.023.007 అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును.కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలనశిక్ష నొందకపోవుదును.

23:8b.JOB.023.008 నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడుపడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు

23:9b.JOB.023.009 ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయిననుఆయన నాకు కానవచ్చుట లేదుదక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను.

23:10b.JOB.023.010 నేను నడచుమార్గము ఆయనకు తెలియునుఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

23:11b.JOB.023.011 నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవినేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.

23:12b.JOB.023.012 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదుఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.

23:13b.JOB.023.013 అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు?ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.

23:14b.JOB.023.014 నాకు విధింపబడినదానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడైయున్నాడు.

23:15b.JOB.023.015 కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నానునేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.

23:16b.JOB.023.016 దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.

23:17b.JOB.023.017 అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండిననునేను నాశనముచేయబడి యుండలేదు.

24

24:1b.JOB.024.001 సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు... ఏర్పాటుచేయడు?ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?

24:2b.JOB.024.002 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.

24:3b.JOB.024.003 తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

24:4b.JOB.024.004 వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించివేయుదురుదేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.

24:5b.JOB.024.005 అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లుబీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురుఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును

24:6b.JOB.024.006 పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురుదుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.

24:7b.JOB.024.007 బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురుచలిలో వస్త్రహీనులై పడియుందురు.

24:8b.JOB.024.008 పర్వతములమీది జల్లులకు తడిసియుందురుచాటులేనందున బండను కౌగలించుకొందురు.

24:9b.JOB.024.009 తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు

24:10b.JOB.024.010 దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురుఆకలిగొని పనలను మోయుదురు.

24:11b.JOB.024.011 వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు.

24:12b.JOB.024.012 జనముగల పట్టణములో మూలుగుదురుగాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.

24:13b.JOB.024.013 వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరుదాని త్రోవలలో నిలువరు.

24:14b.JOB.024.014 తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచునువాడు దరిద్రులను లేమిగలవారిని చంపునురాత్రియందు వాడు దొంగతనము చేయును.

24:15b.JOB.024.015 వ్యభిచారిఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.

24:16b.JOB.024.016 చీకటిలో వారు కన్నము వేయుదురుపగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు

24:17b.JOB.024.017 వారందరు ఉదయమును మరణాంధకారముగాఎంచుదురు.గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.

24:18b.JOB.024.018 జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురువారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తముద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు.

24:19b.JOB.024.019 అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లుపాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.

24:20b.JOB.024.020 కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు

24:21b.JOB.024.021 వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురువిధవరాండ్రకు మేలుచేయరు.

24:22b.JOB.024.022 ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.

24:23b.JOB.024.023 ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురుఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును

24:24b.JOB.024.024 వారు హెచ్చింపబడిననుకొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.

24:25b.JOB.024.025 ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?

25

25:1b.JOB.025.001 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యు త్తరమిచ్చెను

25:2b.JOB.025.002 అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవిఆయన తన ఉన్నతస్థలములలో సమాధానము కలుగ జేయును.

25:3b.JOB.025.003 ఆయన సేనలను లెక్కింప శక్యమా?ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?

25:4b.JOB.025.004 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?

25:5b.JOB.025.005 ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు.

25:6b.JOB.025.006 మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

26

26:1b.JOB.026.001 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

26:2b.JOB.026.002 శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?

26:3b.JOB.026.003 జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి?సంగతిని ఎంత చక్కగా వివరించితివి?

26:4b.JOB.026.004 నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి?ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?

26:5b.JOB.026.005 జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండుప్రేతలు విలవిలలాడుదురు.

26:6b.JOB.026.006 ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నదినాశనకూపము బట్టబయలుగా నున్నది.

26:7b.JOB.026.007 శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెనుశూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.

26:8b.JOB.026.008 వాటిక్రింద మేఘములు చినిగిపోకుండఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.

26:9b.JOB.026.009 దానిమీద మేఘమును వ్యాపింపజేసిఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.

26:10b.JOB.026.010 వెలుగు చీకటుల సరిహద్దులవరకుఆయన జలములకు హద్దు నియమించెను.

26:11b.JOB.026.011 ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయ మొంది అదరును

26:12b.JOB.026.012 తన బలమువలన ఆయన సముద్రమును రేపునుతన వివేకమువలన రాహాబును పగులగొట్టును.

26:13b.JOB.026.013 ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును.ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.

26:14b.JOB.026.014 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?

27

27:1b.JOB.027.001 యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను

27:2b.JOB.027.002 నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటనుబట్టియుదేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు

27:3b.JOB.027.003 నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు

27:4b.JOB.027.004 నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదునా నాలుక మోసము నుచ్చరించుటలేదు.

27:5b.JOB.027.005 మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతనువిడువను.

27:6b.JOB.027.006 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.

27:7b.JOB.027.007 నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక.

27:8b.JOB.027.008 దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది?

27:9b.JOB.027.009 వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?

27:10b.JOB.027.010 వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?

27:11b.JOB.027.011 దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.

27:12b.JOB.027.012 మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు చుందురు?

27:13b.JOB.027.013 దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము

27:14b.JOB.027.014 వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడు టకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.

27:15b.JOB.027.015 వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

27:16b.JOB.027.016 ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను

27:17b.JOB.027.017 వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.

27:18b.JOB.027.018 పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.

27:19b.JOB.027.019 వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.

27:20b.JOB.027.020 భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.

27:21b.JOB.027.021 తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును

27:22b.JOB.027.022 ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.

27:23b.JOB.027.023 మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.

28

28:1b.JOB.028.001 వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.

28:2b.JOB.028.002 ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి తీయుదురు.

28:3b.JOB.028.003 మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు.

28:4b.JOB.028.004 జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పైసంచరించువారిచేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగానుండి ఇటు అటు అల్లాడుచుందురు.

28:5b.JOB.028.005 భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.

28:6b.JOB.028.006 దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.

28:7b.JOB.028.007 ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు

28:8b.JOB.028.008 గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు

28:9b.JOB.028.009 మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.

28:10b.JOB.028.010 బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును.

28:11b.JOB.028.011 నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టు దురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించు దురు

28:12b.JOB.028.012 అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?

28:13b.JOB.028.013 నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.

28:14b.JOB.028.014 అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.

28:15b.JOB.028.015 సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.

28:16b.JOB.028.016 అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.

28:17b.JOB.028.017 సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్య బడదు.

28:18b.JOB.028.018 పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది

28:19b.JOB.028.019 కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.

28:20b.JOB.028.020 అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?

28:21b.JOB.028.021 అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.

28:22b.JOB.028.022 మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.

28:23b.JOB.028.023 దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.

28:24b.JOB.028.024 ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.

28:25b.JOB.028.025 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

28:26b.JOB.028.026 వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచి నప్పుడు

28:27b.JOB.028.027 ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.

28:28b.JOB.028.028 మరియుయెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరు లకు సెలవిచ్చెను.

29

29:1b.JOB.029.001 యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను

29:2b.JOB.029.002 పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు

29:3b.JOB.029.003 అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.

29:4b.JOB.029.004 నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.

29:5b.JOB.029.005 సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి

29:6b.JOB.029.006 నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.

29:7b.JOB.029.007 పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు

29:8b.JOB.029.008 ¸°వనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.

29:9b.JOB.029.009 అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.

29:10b.JOB.029.010 ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.

29:11b.JOB.029.011 నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను.నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.

29:12b.JOB.029.012 ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి పించితిని.

29:13b.JOB.029.013 నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని

29:14b.JOB.029.014 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.

29:15b.JOB.029.015 గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని.

29:16b.JOB.029.016 దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచా రించితిని.

29:17b.JOB.029.017 దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.

29:18b.JOB.029.018 అప్పుడు నేనిట్లనుకొంటినినా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.

29:19b.JOB.029.019 నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును.

29:20b.JOB.029.020 నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును.

29:21b.JOB.029.021 మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.

29:22b.JOB.029.022 నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలుక కుండిరి.గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.

29:23b.JOB.029.023 వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.

29:24b.JOB.029.024 వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవి్వతిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.

29:25b.JOB.029.025 నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.

30

30:1b.JOB.030.001 ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు.వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.

30:2b.JOB.030.002 వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది.

30:3b.JOB.030.003 దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు

30:4b.JOB.030.004 వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.

30:5b.JOB.030.005 వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను

30:6b.JOB.030.006 నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.

30:7b.JOB.030.007 తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.

30:8b.JOB.030.008 వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.

30:9b.JOB.030.009 అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.

30:10b.JOB.030.010 వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమి్మవేయక మానరు

30:11b.JOB.030.011 ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు.

30:12b.JOB.030.012 నా కుడిప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు.

30:13b.JOB.030.013 వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు

30:14b.JOB.030.014 గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.

30:15b.JOB.030.015 భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురుమేఘమువలె నా క్షేమము గతించిపోయెను.

30:16b.JOB.030.016 నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి

30:17b.JOB.030.017 రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.

30:18b.JOB.030.018 మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.

30:19b.JOB.030.019 ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.

30:20b.JOB.030.020 నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.

30:21b.JOB.030.021 నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు

30:22b.JOB.030.022 గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు

30:23b.JOB.030.023 మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును.

30:24b.JOB.030.024 ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా?

30:25b.JOB.030.025 బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా?

30:26b.JOB.030.026 నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.

30:27b.JOB.030.027 నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను.

30:28b.JOB.030.028 సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.

30:29b.JOB.030.029 నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.

30:30b.JOB.030.030 నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.

30:31b.JOB.030.031 నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.

31

31:1b.JOB.031.001 నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?

31:2b.JOB.031.002 ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?

31:3b.JOB.031.003 దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.

31:4b.JOB.031.004 ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా

31:5b.JOB.031.005 అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల

31:6b.JOB.031.006 నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు

31:7b.JOB.031.007 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల

31:8b.JOB.031.008 నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక.

31:9b.JOB.031.009 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల

31:10b.JOB.031.010 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.

31:11b.JOB.031.011 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము

31:12b.JOB.031.012 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.

31:13b.JOB.031.013 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల

31:14b.JOB.031.014 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?

31:15b.JOB.031.015 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

31:16b.JOB.031.016 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను

31:17b.JOB.031.017 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

31:18b.JOB.031.018 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

31:19b.JOB.031.019 వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను

31:20b.JOB.031.020 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను

31:21b.JOB.031.021 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

31:22b.JOB.031.022 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను.నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.

31:23b.JOB.031.023 దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.

31:24b.JOB.031.024 సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను

31:25b.JOB.031.025 నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను

31:26b.JOB.031.026 సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి

31:27b.JOB.031.027 నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.

31:28b.JOB.031.028 అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.

31:29b.JOB.031.029 నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను

31:30b.JOB.031.030 నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.

31:31b.JOB.031.031 అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను

31:32b.JOB.031.032 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.

31:33b.JOB.031.033 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని

31:34b.JOB.031.034 మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును

31:35b.JOB.031.035 నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.

31:36b.JOB.031.036 నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.

31:37b.JOB.031.037 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయనయొద్దకు వెళ్లెదను.

31:38b.JOB.031.038 నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల

31:39b.JOB.031.039 క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను

31:40b.JOB.031.040 గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.

32

32:1b.JOB.032.001 యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.

32:2b.JOB.032.002 అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.

32:3b.JOB.032.003 మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపి నందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.

32:4b.JOB.032.004 వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.

32:5b.JOB.032.005 అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.

32:6b.JOB.032.006 కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.

32:7b.JOB.032.007 వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని;

32:8b.JOB.032.008 అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.

32:9b.JOB.032.009 వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలి సినవారుకారు.

32:10b.JOB.032.010 కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.

32:11b.JOB.032.011 ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై

32:12b.JOB.032.012 మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.

32:13b.JOB.032.013 కావునమాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు.

32:14b.JOB.032.014 అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర మియ్యను.

32:15b.JOB.032.015 వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.

32:16b.JOB.032.016 కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?

32:17b.JOB.032.017 నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.

32:18b.JOB.032.018 నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.

32:19b.JOB.032.019 నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.

32:20b.JOB.032.020 నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.

32:21b.JOB.032.021 మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను

32:22b.JOB.032.022 ముఖస్తుతి చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.

33

33:1b.JOB.033.001 యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.

33:2b.JOB.033.002 ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.

33:3b.JOB.033.003 నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.

33:4b.JOB.033.004 దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను

33:5b.JOB.033.005 నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము.

33:6b.JOB.033.006 దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే

33:7b.JOB.033.007 నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.

33:8b.JOB.033.008 నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను.

33:9b.JOB.033.009 ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.

33:10b.JOB.033.010 ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.

33:11b.JOB.033.011 ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు.

33:12b.JOB.033.012 ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.

33:13b.JOB.033.013 తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తర మియ్యడు దేవుడు నరులశక్తికిమించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు?

33:14b.JOB.033.014 దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు

33:15b.JOB.033.015 మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టు నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో

33:16b.JOB.033.016 నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు

33:17b.JOB.033.017 గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు

33:18b.JOB.033.018 ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.

33:19b.JOB.033.019 వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును

33:20b.JOB.033.020 రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును

33:21b.JOB.033.021 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొని వచ్చును

33:22b.JOB.033.022 వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.

33:23b.JOB.033.023 నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకువేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల

33:24b.JOB.033.024 దేవుడు వానియందు కరుణ జూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.

33:25b.JOB.033.025 అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరో గ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.

33:26b.JOB.033.026 వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషిం చును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.

33:27b.JOB.033.027 అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు

33:28b.JOB.033.028 కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.

33:29b.JOB.033.029 ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగుచేత వెలిగింపబడునట్లు

33:30b.JOB.033.030 కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని మానవులకొరకు రెండు సారులు మూడు సారులు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు.

33:31b.JOB.033.031 యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను.

33:32b.JOB.033.032 చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరు చున్నాను.

33:33b.JOB.033.033 మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించె దను.

34

34:1b.JOB.034.001 అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను

34:2b.JOB.034.002 జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి

34:3b.JOB.034.003 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.

34:4b.JOB.034.004 న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి.

34:5b.JOB.034.005 నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను

34:6b.JOB.034.006 న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నానునేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.

34:7b.JOB.034.007 యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.

34:8b.JOB.034.008 అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.

34:9b.JOB.034.009 నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.

34:10b.JOB.034.010 విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

34:11b.JOB.034.011 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును.

34:12b.JOB.034.012 దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.

34:13b.JOB.034.013 ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?

34:14b.JOB.034.014 ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనిన యెడల

34:15b.JOB.034.015 శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.

34:16b.JOB.034.016 కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము.

34:17b.JOB.034.017 న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైనవానిమీద నేరము మోపుదువా?

34:18b.JOB.034.018 నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా?

34:19b.JOB.034.019 రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?

34:20b.JOB.034.020 వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.

34:21b.JOB.034.021 ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.

34:22b.JOB.034.022 దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.

34:23b.JOB.034.023 ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి అగత్యము లేదు.

34:24b.JOB.034.024 విచారణ లేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.

34:25b.JOB.034.025 వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు.

34:26b.JOB.034.026 దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.

34:27b.JOB.034.027 ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.

34:28b.JOB.034.028 బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.

34:29b.JOB.034.029 ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింప గలవాడెవడు?ఆయన తన ముఖమును దాచుకొనినయెడలఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను ఒకటే

34:30b.JOB.034.030 భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు

34:31b.JOB.034.031 ఒకడునేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను

34:32b.JOB.034.032 నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా?

34:33b.JOB.034.033 నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా? లేనియెడల నీవుందువా? నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము.

34:34b.JOB.034.034 వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు

34:35b.JOB.034.035 యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి

34:36b.JOB.034.036 దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరు చున్నాను.

34:37b.JOB.034.037 అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.

35

35:1b.JOB.035.001 మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

35:2b.JOB.035.002 నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే?

35:3b.JOB.035.003 ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా?

35:4b.JOB.035.004 నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.

35:5b.JOB.035.005 ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.

35:6b.JOB.035.006 నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా?

35:7b.JOB.035.007 నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు చున్నావా?ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?

35:8b.JOB.035.008 నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును.

35:9b.JOB.035.009 అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.

35:10b.JOB.035.010 అయితేరాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు

35:11b.JOB.035.011 భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును లేరు.

35:12b.JOB.035.012 కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు.

35:13b.JOB.035.013 నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.

35:14b.JOB.035.014 ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను.

35:15b.JOB.035.015 ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను

35:16b.JOB.035.016 నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.

36

36:1b.JOB.036.001 మరియు ఎలీహు ఇంక యిట్లనెను

36:2b.JOB.036.002 కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ వలసి యున్నది.

36:3b.JOB.036.003 దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను.

36:4b.JOB.036.004 నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.

36:5b.JOB.036.005 ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.

36:6b.JOB.036.006 భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును.

36:7b.JOB.036.007 నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.

36:8b.JOB.036.008 వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను

36:9b.JOB.036.009 అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషము లను వారికి తెలియజేయును.

36:10b.JOB.036.010 ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.

36:11b.JOB.036.011 వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.

36:12b.JOB.036.012 వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు.

36:13b.JOB.036.013 అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.

36:14b.JOB.036.014 కావున వారు ¸°వనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.

36:15b.JOB.036.015 శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును.బాధవలన వారిని విధేయులుగా చేయును.

36:16b.JOB.036.016 అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.

36:17b.JOB.036.017 దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.

36:18b.JOB.036.018 నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.

36:19b.JOB.036.019 నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయుబాధనొందకుండ నిన్ను తప్పించునా?

36:20b.JOB.036.020 జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.

36:21b.JOB.036.021 జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు కొనియున్నావు.

36:22b.JOB.036.022 ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు?

36:23b.JOB.036.023 ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?

36:24b.JOB.036.024 మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.

36:25b.JOB.036.025 మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు.

36:26b.JOB.036.026 ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.

36:27b.JOB.036.027 ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును

36:28b.JOB.036.028 మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.

36:29b.JOB.036.029 మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?

36:30b.JOB.036.030 ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.

36:31b.JOB.036.031 వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు

36:32b.JOB.036.032 ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును

36:33b.JOB.036.033 ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.

37

37:1b.JOB.037.001 దీనినిబట్టి నా హృదయము వణకుచున్నదిదాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది.

37:2b.JOB.037.002 ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.

37:3b.JOB.037.003 ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును.

37:4b.JOB.037.004 దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు

37:5b.JOB.037.005 దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును.

37:6b.JOB.037.006 నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చు చున్నాడు.

37:7b.JOB.037.007 మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొను నట్లు ప్రతి మనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసి యున్నాడు.

37:8b.JOB.037.008 జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును.

37:9b.JOB.037.009 మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును

37:10b.JOB.037.010 దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.

37:11b.JOB.037.011 మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.

37:12b.JOB.037.012 ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును

37:13b.JOB.037.013 శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.

37:14b.JOB.037.014 యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.

37:15b.JOB.037.015 దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా?

37:16b.JOB.037.016 మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?

37:17b.JOB.037.017 దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?

37:18b.JOB.037.018 పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా?

37:19b.JOB.037.019 మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది

37:20b.JOB.037.020 నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?

37:21b.JOB.037.021 ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కను పరచును.

37:22b.JOB.037.022 ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు.

37:23b.JOB.037.023 సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు.న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగి యుందురు.

37:24b.JOB.037.024 తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు.

38

38:1b.JOB.038.001 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను

38:2b.JOB.038.002 జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?

38:3b.JOB.038.003 పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.

38:4b.JOB.038.004 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.

38:5b.JOB.038.005 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.

38:6b.JOB.038.006 దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.

38:7b.JOB.038.007 ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?

38:8b.JOB.038.008 సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?

38:9b.JOB.038.009 నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?

38:10b.JOB.038.010 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు

38:11b.JOB.038.011 నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?

38:12b.JOB.038.012 అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును

38:13b.JOB.038.013 అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?

38:14b.JOB.038.014 ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును.

38:15b.JOB.038.015 దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.

38:16b.JOB.038.016 సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?

38:17b.JOB.038.017 మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?

38:18b.JOB.038.018 భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.

38:19b.JOB.038.019 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?

38:20b.JOB.038.020 దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.

38:21b.JOB.038.021 నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.

38:22b.JOB.038.022 నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?

38:23b.JOB.038.023 ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?

38:24b.JOB.038.024 వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?

38:25b.JOB.038.025 నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును

38:26b.JOB.038.026 పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను

38:27b.JOB.038.027 ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?

38:28b.JOB.038.028 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?

38:29b.JOB.038.029 మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?

38:30b.JOB.038.030 జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.

38:31b.JOB.038.031 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?

38:32b.JOB.038.032 వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?

38:33b.JOB.038.033 ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?

38:34b.JOB.038.034 జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?

38:35b.JOB.038.035 మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?

38:36b.JOB.038.036 అంతరింద్రియములలో2 జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు3 తెలివి నిచ్చినవాడెవడు?

38:37b.JOB.038.037 జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?

38:38b.JOB.038.038 ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?

38:39b.JOB.038.039 ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?

38:40b.JOB.038.040 సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?

38:41b.JOB.038.041 తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?

39

39:1b.JOB.039.001 అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?

39:2b.JOB.039.002 అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?

39:3b.JOB.039.003 అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.

39:4b.JOB.039.004 వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.

39:5b.JOB.039.005 అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?

39:6b.JOB.039.006 నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.

39:7b.JOB.039.007 పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.

39:8b.JOB.039.008 పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.

39:9b.JOB.039.009 గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?

39:10b.JOB.039.010 పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?

39:11b.JOB.039.011 దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?

39:12b.JOB.039.012 అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?

39:13b.JOB.039.013 నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?

39:14b.JOB.039.014 లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.

39:15b.JOB.039.015 దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.

39:16b.JOB.039.016 తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు

39:17b.JOB.039.017 దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.

39:18b.JOB.039.018 అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.

39:19b.JOB.039.019 గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?

39:20b.JOB.039.020 మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.

39:21b.JOB.039.021 మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.

39:22b.JOB.039.022 అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.

39:23b.JOB.039.023 అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగలలాడించబడునప్పుడు

39:24b.JOB.039.024 ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.

39:25b.JOB.039.025 బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.

39:26b.JOB.039.026 డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?

39:27b.JOB.039.027 పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?

39:28b.JOB.039.028 అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.

39:29b.JOB.039.029 అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.

39:30b.JOB.039.030 దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.

40

40:1b.JOB.040.001 మరియు యెహోవా యోబునకు ఈలాగు...ప్రత్యుత్తరమిచ్చెను

40:2b.JOB.040.002 ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్య వలెను.

40:3b.JOB.040.003 అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

40:4b.JOB.040.004 చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.

40:5b.JOB.040.005 ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.

40:6b.JOB.040.006 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను

40:7b.JOB.040.007 పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము.

40:8b.JOB.040.008 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప రాధము మోపుదువా?

40:9b.JOB.040.009 దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా?

40:10b.JOB.040.010 ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించు కొనుము గౌరవప్రభావములను ధరించుకొనుము.

40:11b.JOB.040.011 నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగ జేయుము.

40:12b.JOB.040.012 గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము.

40:13b.JOB.040.013 కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము.

40:14b.JOB.040.014 అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.

40:15b.JOB.040.015 నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును.

40:16b.JOB.040.016 దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.

40:17b.JOB.040.017 దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి.

40:18b.JOB.040.018 దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి

40:19b.JOB.040.019 అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.

40:20b.JOB.040.020 పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.

40:21b.JOB.040.021 తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును

40:22b.JOB.040.022 తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.

40:23b.JOB.040.023 నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు.

40:24b.JOB.040.024 అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?

41

41:1b.JOB.041.001 నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?...దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?

41:2b.JOB.041.002 నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?

41:3b.JOB.041.003 అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా?

41:4b.JOB.041.004 నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా?

41:5b.JOB.041.005 నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?

41:6b.JOB.041.006 బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా?

41:7b.JOB.041.007 దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?

41:8b.JOB.041.008 దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు.

41:9b.JOB.041.009 దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా.

41:10b.JOB.041.010 దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?

41:11b.JOB.041.011 నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా

41:12b.JOB.041.012 దాని అవయవములను గూర్చియైనను దాని మహాబల మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి యైనను పలుకక మౌనముగా నుండను.

41:13b.JOB.041.013 ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?

41:14b.JOB.041.014 దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు

41:15b.JOB.041.015 దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి.

41:16b.JOB.041.016 అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు.

41:17b.JOB.041.017 ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి.

41:18b.JOB.041.018 అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి

41:19b.JOB.041.019 దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును.

41:20b.JOB.041.020 ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును.

41:21b.JOB.041.021 దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును

41:22b.JOB.041.022 దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును

41:23b.JOB.041.023 దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు.

41:24b.JOB.041.024 దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.

41:25b.JOB.041.025 అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు.

41:26b.JOB.041.026 దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు.

41:27b.JOB.041.027 ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.

41:28b.JOB.041.028 బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి.

41:29b.JOB.041.029 దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.

41:30b.JOB.041.030 దాని క్రిందిభాగములుకరుకైనచిల్లపెంకులవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును.

41:31b.JOB.041.031 కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ జేయునుసముద్రమును తైలమువలె చేయును.

41:32b.JOB.041.032 అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప జేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.

41:33b.JOB.041.033 అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు.

41:34b.JOB.041.034 అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.

42

42:1b.JOB.042.001 అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు త్తరమిచ్చెను

42:2b.JOB.042.002 నీవు సమస్తక్రియలను చేయగలవనియునీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియునేనిప్పుడు తెలిసికొంటిని.

42:3b.JOB.042.003 జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.

42:4b.JOB.042.004 నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము.

42:5b.JOB.042.005 వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను.

42:6b.JOB.042.006 కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.

42:7b.JOB.042.007 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెల విచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదనుమండుచున్నది

42:8b.JOB.042.008 కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.

42:9b.JOB.042.009 తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.

42:10b.JOB.042.010 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.

42:11b.JOB.042.011 అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను.

42:12b.JOB.042.012 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.

42:13b.JOB.042.013 మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

42:14b.JOB.042.014 అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను.

42:15b.JOB.042.015 ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.

42:16b.JOB.042.016 అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.

42:17b.JOB.042.017 పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.


Holder of rights
Multilingual Bible Corpus

Citation Suggestion for this Object
TextGrid Repository (2025). Telugu Collection. Job (Telugu). Job (Telugu). Multilingual Parallel Bible Corpus. Multilingual Bible Corpus. https://hdl.handle.net/21.11113/0000-0016-BDB9-3