1 Chronicles (Telugu)

1 Chronicles (Telugu)

1

1:1b.1CH.001.001 ఆదాము షేతు ఎనోషు

1:2b.1CH.001.002 కేయినాను మహలలేలు యెరెదు

1:3b.1CH.001.003 హనోకు మెతూషెల లెమెకు

1:4b.1CH.001.004 నోవహు షేము హాము యాపెతు.

1:5b.1CH.001.005 యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

1:6b.1CH.001.006 గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.

1:7b.1CH.001.007 యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.

1:8b.1CH.001.008 హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

1:9b.1CH.001.009 కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.

1:10b.1CH.001.010 కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.

1:11b.1CH.001.011 లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు

1:12b.1CH.001.012 పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

1:13b.1CH.001.013 కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

1:14b.1CH.001.014 యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

1:15b.1CH.001.015 హివ్వీయులు అర్కీయులు సీనీయులు

1:16b.1CH.001.016 అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.

1:17b.1CH.001.017 షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

1:18b.1CH.001.018 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

1:19b.1CH.001.019 ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

1:20b.1CH.001.020 యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

1:21b.1CH.001.021 హదోరమును ఊజాలును దిక్లానును

1:22b.1CH.001.022 ఏబాలును అబీమా యేలును షేబను

1:23b.1CH.001.023 ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.

1:24b.1CH.001.024 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ

1:25b.1CH.001.025 సెరూగు నాహోరు తెరహు

1:26b.1CH.001.026 అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.

1:27b.1CH.001.027 అబ్రాహాము కుమారులు,

1:28b.1CH.001.028 ఇస్సాకు ఇష్మాయేలు.

1:29b.1CH.001.029 వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము

1:30b.1CH.001.030 మిష్మా దూమా మశ్శా హదదు తేమా

1:31b.1CH.001.031 యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.

1:32b.1CH.001.032 అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.

1:33b.1CH.001.033 మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.

1:34b.1CH.001.034 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.

1:35b.1CH.001.035 ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.

1:36b.1CH.001.036 ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.

1:37b.1CH.001.037 రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.

1:38b.1CH.001.038 శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.

1:39b.1CH.001.039 లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

1:40b.1CH.001.040 శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.

1:41b.1CH.001.041 అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.

1:42b.1CH.001.042 ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.

1:43b.1CH.001.043 ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.

1:44b.1CH.001.044 బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.

1:45b.1CH.001.045 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.

1:46b.1CH.001.046 హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.

1:47b.1CH.001.047 హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.

1:48b.1CH.001.048 శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.

1:49b.1CH.001.049 షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.

1:50b.1CH.001.050 బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.

1:51b.1CH.001.051 హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,

1:52b.1CH.001.052 అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,

1:53b.1CH.001.053 కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,

1:54b.1CH.001.054 మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.

2

2:1b.1CH.002.001 ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను

2:2b.1CH.002.002 దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

2:3b.1CH.002.003 యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.

2:4b.1CH.002.004 మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.

2:5b.1CH.002.005 పెరెసు కుమారులు హెస్రోను హామూలు.

2:6b.1CH.002.006 జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.

2:7b.1CH.002.007 కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.

2:8b.1CH.002.008 ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.

2:9b.1CH.002.009 హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.

2:10b.1CH.002.010 రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.

2:11b.1CH.002.011 నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,

2:12b.1CH.002.012 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,

2:13b.1CH.002.013 యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

2:14b.1CH.002.014 నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని

2:15b.1CH.002.015 ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.

2:16b.1CH.002.016 సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.

2:17b.1CH.002.017 అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.

2:18b.1CH.002.018 హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.

2:19b.1CH.002.019 అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.

2:20b.1CH.002.020 హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.

2:21b.1CH.002.021 తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.

2:22b.1CH.002.022 సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.

2:23b.1CH.002.023 మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.

2:24b.1CH.002.024 కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.

2:25b.1CH.002.025 హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.

2:26b.1CH.002.026 అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.

2:27b.1CH.002.027 యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.

2:28b.1CH.002.028 ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.

2:29b.1CH.002.029 అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.

2:30b.1CH.002.030 నాదాబు కుమా రులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను

2:31b.1CH.002.031 అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,

2:32b.1CH.002.032 షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను.

2:33b.1CH.002.033 యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.

2:34b.1CH.002.034 షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు

2:35b.1CH.002.035 షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.

2:36b.1CH.002.036 అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,

2:37b.1CH.002.037 జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,

2:38b.1CH.002.038 ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,

2:39b.1CH.002.039 అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,

2:40b.1CH.002.040 ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,

2:41b.1CH.002.041 షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.

2:42b.1CH.002.042 యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

2:43b.1CH.002.043 హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.

2:44b.1CH.002.044 షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.

2:45b.1CH.002.045 షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.

2:46b.1CH.002.046 కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.

2:47b.1CH.002.047 యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.

2:48b.1CH.002.048 కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.

2:49b.1CH.002.049 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.

2:50b.1CH.002.050 ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,

2:51b.1CH.002.051 బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును.

2:52b.1CH.002.052 కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.

2:53b.1CH.002.053 కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి.

2:54b.1CH.002.054 శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.

2:55b.1CH.002.055 యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.

3

3:1b.1CH.003.001 దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,

3:2b.1CH.003.002 గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవ వాడు,

3:3b.1CH.003.003 అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లాకనిన ఇత్రెయాము ఆరవవాడు,

3:4b.1CH.003.004 ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,

3:5b.1CH.003.005 యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు

3:6b.1CH.003.006 ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా

3:7b.1CH.003.007 ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.

3:8b.1CH.003.008 ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.

3:9b.1CH.003.009 సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.

3:10b.1CH.003.010 అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు

3:11b.1CH.003.011 యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,

3:12b.1CH.003.012 యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు

3:13b.1CH.003.013 యోతామునకు ఆహాజు కుమా రుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,

3:14b.1CH.003.014 మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.

3:15b.1CH.003.015 యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.

3:16b.1CH.003.016 యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.

3:17b.1CH.003.017 యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు

3:18b.1CH.003.018 మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.

3:19b.1CH.003.019 పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి.

3:20b.1CH.003.020 హషుబా ఓహెలు బెరెక్యాహసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి.

3:21b.1CH.003.021 హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.

3:22b.1CH.003.022 షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.

3:23b.1CH.003.023 నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యోయేనై హిజ్కియా అజ్రీకాము;

3:24b.1CH.003.024 ఎల్యోయేనై కుమారులు ఏడుగురు; హోదవ్యా ఎల్యాషీబు పెలాయా అక్కూబు యోహానాను దెలాయ్యా అనాని.

4

4:1b.1CH.004.001 యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.

4:2b.1CH.004.002 శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.

4:3b.1CH.004.003 అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.

4:4b.1CH.004.004 మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.

4:5b.1CH.004.005 తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.

4:6b.1CH.004.006 నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.

4:7b.1CH.004.007 హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.

4:8b.1CH.004.008 కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.

4:9b.1CH.004.009 యబ్బేజు1 తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.

4:10b.1CH.004.010 యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.

4:11b.1CH.004.011 షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.

4:12b.1CH.004.012 ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.

4:13b.1CH.004.013 కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.

4:14b.1CH.004.014 మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.

4:15b.1CH.004.015 యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.

4:16b.1CH.004.016 యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.

4:17b.1CH.004.017 ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.

4:18b.1CH.004.018 అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

4:19b.1CH.004.019 మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయు డైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.

4:20b.1CH.004.020 షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు.

4:21b.1CH.004.021 యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును

4:22b.1CH.004.022 యోకీ మీయులకును కోజే బాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూ బిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.

4:23b.1CH.004.023 వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.

4:24b.1CH.004.024 షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.

4:25b.1CH.004.025 షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.

4:26b.1CH.004.026 మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.

4:27b.1CH.004.027 షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.

4:28b.1CH.004.028 వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను

4:29b.1CH.004.029 బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను

4:30b.1CH.004.030 హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.

4:31b.1CH.004.031 దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.

4:32b.1CH.004.032 ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.

4:33b.1CH.004.033 బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.

4:34b.1CH.004.034 వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా,

4:35b.1CH.004.035 యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.

4:36b.1CH.004.036 ఎల్యోయేనై యహకోబా యెషోహాయా అశాయా అదీయేలు యెశీమీయేలు బెనాయా;

4:37b.1CH.004.037 షెమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు.

4:38b.1CH.004.038 పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను.

4:39b.1CH.004.039 వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి

4:40b.1CH.004.040 మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వ మందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపుర ముండిరి.

4:41b.1CH.004.041 పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.

4:42b.1CH.004.042 షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధి పతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి

4:43b.1CH.004.043 అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు.

5

5:1b.1CH.005.001 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమా రులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠు డుగా దాఖలుచేయబడలేదు.

5:2b.1CH.005.002 యూదా తన సహోద రులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను.

5:3b.1CH.005.003 ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారు లెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ.

5:4b.1CH.005.004 యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు,

5:5b.1CH.005.005 షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు,

5:6b.1CH.005.006 బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను.

5:7b.1CH.005.007 వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబ ముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును,

5:8b.1CH.005.008 యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.

5:9b.1CH.005.009 వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారము కాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి.

5:10b.1CH.005.010 సౌలు దినములలో వారు హగ్రీ యీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.

5:11b.1CH.005.011 గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.

5:12b.1CH.005.012 వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.

5:13b.1CH.005.013 వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు.

5:14b.1CH.005.014 వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.

5:15b.1CH.005.015 గూనీ కుమారుడైన అబ్దీ యేలునకు పుట్టిన అహీ వారి పితరుల యిండ్లవారికి పెద్ద.

5:16b.1CH.005.016 వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి.

5:17b.1CH.005.017 వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి.

5:18b.1CH.005.018 రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.

5:19b.1CH.005.019 వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.

5:20b.1CH.005.020 యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమి్మకయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను

5:21b.1CH.005.021 గనుక వారిని జయించు టకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబది వేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.

5:22b.1CH.005.022 యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడు వరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.

5:23b.1CH.005.023 మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపుర ముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి.

5:24b.1CH.005.024 వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమ శాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి.

5:25b.1CH.005.025 అయితే వారు తమ పితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి.

5:26b.1CH.005.026 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.

6

6:1b.1CH.006.001 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.

6:2b.1CH.006.002 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

6:3b.1CH.006.003 అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.

6:4b.1CH.006.004 ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవ ను కనెను,

6:5b.1CH.006.005 అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,

6:6b.1CH.006.006 ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,

6:7b.1CH.006.007 మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,

6:8b.1CH.006.008 అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,

6:9b.1CH.006.009 అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,

6:10b.1CH.006.010 యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.

6:11b.1CH.006.011 అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,

6:12b.1CH.006.012 అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,

6:13b.1CH.006.013 షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,

6:14b.1CH.006.014 అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.

6:15b.1CH.006.015 యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.

6:16b.1CH.006.016 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.

6:17b.1CH.006.017 గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.

6:18b.1CH.006.018 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.

6:19b.1CH.006.019 మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా

6:20b.1CH.006.020 గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,

6:21b.1CH.006.021 జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.

6:22b.1CH.006.022 కహాతు కుమారులలో ఒకడు అమీ్మనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,

6:23b.1CH.006.023 అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,

6:24b.1CH.006.024 అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.

6:25b.1CH.006.025 ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.

6:26b.1CH.006.026 ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,

6:27b.1CH.006.027 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.

6:28b.1CH.006.028 సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.

6:29b.1CH.006.029 మెరారి కుమారు లలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా

6:30b.1CH.006.030 ఉజ్జా కుమా రుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.

6:31b.1CH.006.031 నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే.

6:32b.1CH.006.032 సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుండిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి.

6:33b.1CH.006.033 ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు

6:34b.1CH.006.034 సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను,

6:35b.1CH.006.035 తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,

6:36b.1CH.006.036 అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,

6:37b.1CH.006.037 జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,

6:38b.1CH.006.038 కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.

6:39b.1CH.006.039 హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,

6:40b.1CH.006.040 షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు,బయశేయా మల్కీయా కుమారుడు,

6:41b.1CH.006.041 మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు,

6:42b.1CH.006.042 అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు,

6:43b.1CH.006.043 షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.

6:44b.1CH.006.044 మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు,

6:45b.1CH.006.045 హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,

6:46b.1CH.006.046 హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు,

6:47b.1CH.006.047 షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.

6:48b.1CH.006.048 వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి.

6:49b.1CH.006.049 అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపు చుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను.

6:50b.1CH.006.050 అహరోను కుమారు లలో ఎలి యాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,

6:51b.1CH.006.051 అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,

6:52b.1CH.006.052 జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,

6:53b.1CH.006.053 అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.

6:54b.1CH.006.054 అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.

6:55b.1CH.006.055 యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.

6:56b.1CH.006.056 అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.

6:57b.1CH.006.057 అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,

6:58b.1CH.006.058 హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,

6:59b.1CH.006.059 ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు.

6:60b.1CH.006.060 మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.

6:61b.1CH.006.061 కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.

6:62b.1CH.006.062 గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.

6:63b.1CH.006.063 మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను.

6:64b.1CH.006.064 ఈ ప్రకారముగా ఇశ్రా యేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి.

6:65b.1CH.006.065 వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.

6:66b.1CH.006.066 కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.

6:67b.1CH.006.067 ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును,

6:68b.1CH.006.068 యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,

6:69b.1CH.006.069 అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.

6:70b.1CH.006.070 మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.

6:71b.1CH.006.071 మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,

6:72b.1CH.006.072 ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,

6:73b.1CH.006.073 రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,

6:74b.1CH.006.074 ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు,

6:75b.1CH.006.075 హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;

6:76b.1CH.006.076 నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలి లయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్య బడెను.

6:77b.1CH.006.077 మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు,

6:78b.1CH.006.078 యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,

6:79b.1CH.006.079 కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,

6:80b.1CH.006.080 గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,

6:81b.1CH.006.081 హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.

7

7:1b.1CH.007.001 ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు

7:2b.1CH.007.002 తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.

7:3b.1CH.007.003 ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.

7:4b.1CH.007.004 వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరుల యిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.

7:5b.1CH.007.005 మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.

7:6b.1CH.007.006 బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.

7:7b.1CH.007.007 బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.

7:8b.1CH.007.008 బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.

7:9b.1CH.007.009 వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు.

7:10b.1CH.007.010 యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.

7:11b.1CH.007.011 యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.

7:12b.1CH.007.012 షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.

7:13b.1CH.007.013 నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.

7:14b.1CH.007.014 మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదు నకు పెద్దయైన మాకీరును కూడ కనెను.

7:15b.1CH.007.015 మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.

7:16b.1CH.007.016 మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు పెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము.

7:17b.1CH.007.017 ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.

7:18b.1CH.007.018 మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.

7:19b.1CH.007.019 షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.

7:20b.1CH.007.020 ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,

7:21b.1CH.007.021 తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.

7:22b.1CH.007.022 వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.

7:23b.1CH.007.023 తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను;తన యింటికి కీడు కలిగి నందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.

7:24b.1CH.007.024 అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‌ హోరోనును దక్షిణపు బేత్‌ హోరోనును ఉజ్జెన్‌ షెయెరాను కట్టించెను.

7:25b.1CH.007.025 వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమా రుడు తెలహు, తెలహు కుమారుడు తహను,

7:26b.1CH.007.026 తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,

7:27b.1CH.007.027 ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.

7:28b.1CH.007.028 వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.

7:29b.1CH.007.029 మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామ ములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి.

7:30b.1CH.007.030 ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.

7:31b.1CH.007.031 బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.

7:32b.1CH.007.032 హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.

7:33b.1CH.007.033 యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.

7:34b.1CH.007.034 షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.

7:35b.1CH.007.035 వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.

7:36b.1CH.007.036 జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా

7:37b.1CH.007.037 బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.

7:38b.1CH.007.038 ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.

7:39b.1CH.007.039 ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.

7:40b.1CH.007.040 ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.

8

8:1b.1CH.008.001 బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

8:2b.1CH.008.002 మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.

8:3b.1CH.008.003 బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

8:4b.1CH.008.004 అబీషూవ నయమాను అహోయహు

8:5b.1CH.008.005 గెరా షెపూపాను హూరాము

8:6b.1CH.008.006 ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;

8:7b.1CH.008.007 నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.

8:8b.1CH.008.008 వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

8:9b.1CH.008.009 తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

8:10b.1CH.008.010 యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.

8:11b.1CH.008.011 హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.

8:12b.1CH.008.012 ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

8:13b.1CH.008.013 బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.

8:14b.1CH.008.014 అహ్యోషాషకు యెరేమోతు

8:15b.1CH.008.015 జెబద్యా అరాదు ఏదెరు

8:16b.1CH.008.016 మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.

8:17b.1CH.008.017 జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు

8:18b.1CH.008.018 ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.

8:19b.1CH.008.019 యాకీము జిఖ్రీ జిబ్ది

8:20b.1CH.008.020 ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.

8:21b.1CH.008.021 అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.

8:22b.1CH.008.022 ఇష్పాను ఏబెరు ఎలీయేలు

8:23b.1CH.008.023 అబ్దోను జిఖ్రీ హానాను

8:24b.1CH.008.024 హనన్యా ఏలాము అంతోతీయా

8:25b.1CH.008.025 ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.

8:26b.1CH.008.026 షంషెరై షెహర్యా అతల్యా

8:27b.1CH.008.027 యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.

8:28b.1CH.008.028 వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.

8:29b.1CH.008.029 గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;

8:30b.1CH.008.030 ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు

8:31b.1CH.008.031 గెదోరు అహ్యో జెకెరు అనువారు.

8:32b.1CH.008.032 మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.

8:33b.1CH.008.033 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

8:34b.1CH.008.034 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

8:35b.1CH.008.035 మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.

8:36b.1CH.008.036 ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

8:37b.1CH.008.037 మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.

8:38b.1CH.008.038 ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.

8:39b.1CH.008.039 అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.

8:40b.1CH.008.040 ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.

9

9:1b.1CH.009.001 ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రా యేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.

9:2b.1CH.009.002 తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకు లును లేవీయులును నెతీనీయులును.

9:3b.1CH.009.003 యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా

9:4b.1CH.009.004 యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారు డైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.

9:5b.1CH.009.005 షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.

9:6b.1CH.009.006 జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబది మంది,

9:7b.1CH.009.007 బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,

9:8b.1CH.009.008 యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.

9:9b.1CH.009.009 వీరును వీరిసహోదరులును తమ తమ వంశముల పట్టీల చొప్పున తొమి్మదివందల ఏబది ఆరుగురు; ఈ మనుష్యులందరును తమ పితరుల వంశములనుబట్టి తమ పితరుల యిండ్లకు పెద్దలు.

9:10b.1CH.009.010 యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను,

9:11b.1CH.009.011 దేవుని మందిరములో అధిపతియైన అహీ టూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా;

9:12b.1CH.009.012 మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతు నకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.

9:13b.1CH.009.013 మరియు తమ పితరుల యిండ్లకు పెద్దలైన వెయ్యిన్ని యేడువందల అరువది మంది కుటుంబికులు. వీరు దేవుని మందిరసేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు.

9:14b.1CH.009.014 మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,

9:15b.1CH.009.015 బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,

9:16b.1CH.009.016 యదూతోను కుమారు డైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.

9:17b.1CH.009.017 ద్వారపాలకులు ఎవరనగా షల్లూము అక్కూబు టల్మోను అహీమాను అనువారును వారి సహో దరులును. వీరిలో షల్లూము పెద్ద.

9:18b.1CH.009.018 లేవీయుల సమూహ ములలో వీరు తూర్పుననుండు రాజు గుమ్మమునొద్ద ఇంత వరకు కాపురము చేయుచున్నారు.

9:19b.1CH.009.019 మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహో దరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీదనుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై యుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.

9:20b.1CH.009.020 ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారిమీద అధికారియై యుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.

9:21b.1CH.009.021 మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారముయొక్క ద్వారమునకు కావలి.

9:22b.1CH.009.022 గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.

9:23b.1CH.009.023 వారికిని వారి కుమారు లకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడా రపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను.

9:24b.1CH.009.024 గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.

9:25b.1CH.009.025 వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారివారియొద్దకు వచ్చుటకద్దు.

9:26b.1CH.009.026 లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.

9:27b.1CH.009.027 వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపని వారిదే.

9:28b.1CH.009.028 వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను.

9:29b.1CH.009.029 మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరి శుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.

9:30b.1CH.009.030 యాజకుల కుమారు లలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయు దురు.

9:31b.1CH.009.031 లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండివంటలమీదనుంచబడెను.

9:32b.1CH.009.032 వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగియుండెను.

9:33b.1CH.009.033 లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.

9:34b.1CH.009.034 వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.

9:35b.1CH.009.035 గిబియోను తండ్రి యైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.

9:36b.1CH.009.036 ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు

9:37b.1CH.009.037 గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.

9:38b.1CH.009.038 మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతో కూడ తమ సహోదరులకు ఎదురుగా నున్న యిండ్లలోనే కాపురముండిరి.

9:39b.1CH.009.039 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

9:40b.1CH.009.040 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

9:41b.1CH.009.041 మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ (ఆహాజు.)

9:42b.1CH.009.042 ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

9:43b.1CH.009.043 మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.

9:44b.1CH.009.044 ఆజేలునకు ఆరుగురు కుమారు లుండిరి; వారు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను అను పేళ్లుగలవారు; వీరు ఆజేలు కుమారులు.

10

10:1b.1CH.010.001 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము...చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.

10:2b.1CH.010.002 ఫిలిష్తీ యులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనా దాబును మల్కీషూవను హతముచేసిరి.

10:3b.1CH.010.003 యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.

10:4b.1CH.010.004 అప్పుడు సౌలుఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.

10:5b.1CH.010.005 సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.

10:6b.1CH.010.006 ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటివారందరును చచ్చిరి.

10:7b.1CH.010.007 జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.

10:8b.1CH.010.008 హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చి పడియుండుట చూచి

10:9b.1CH.010.009 అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధ ములను తీసికొని పోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.

10:10b.1CH.010.010 వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.

10:11b.1CH.010.011 ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు విని నప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి,

10:12b.1CH.010.012 సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సిందూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉప వాసముండిరి.

10:13b.1CH.010.013 ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను.

10:14b.1CH.010.014 అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.

11

11:1b.1CH.011.001 అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చిచిత్తగిం చుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.

11:2b.1CH.011.002 ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివినా జనులగు ఇశ్రాయేలీ యులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.

11:3b.1CH.011.003 ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూ యేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.

11:4b.1CH.011.004 తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.

11:5b.1CH.011.005 అప్పుడునీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.

11:6b.1CH.011.006 ఎవడు మొదట యెబూ సీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను.

11:7b.1CH.011.007 తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.

11:8b.1CH.011.008 దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.

11:9b.1CH.011.009 సైన్యముల కధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.

11:10b.1CH.011.010 ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకా రము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యము నందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.

11:11b.1CH.011.011 దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు;ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.

11:12b.1CH.011.012 ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమ శాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.

11:13b.1CH.011.013 ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమీ్మములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.

11:14b.1CH.011.014 వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.

11:15b.1CH.011.015 ముప్పదిమంది పరాక్రమ శాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.

11:16b.1CH.011.016 దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.

11:17b.1CH.011.017 దావీదు ఆశపడిబేత్లెహేమునందలి ఊరి గవినియొద్ది బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా

11:18b.1CH.011.018 ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ది బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి

11:19b.1CH.011.019 నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరా క్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.

11:20b.1CH.011.020 యోవాబు సహోదరు డైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.

11:21b.1CH.011.021 ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.

11:22b.1CH.011.022 మరియు కబ్సెయేలు సంబంధుడును పరా క్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమా రుల నిద్దరిని చంపెను;మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను.

11:23b.1CH.011.023 అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేత పట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడ లాగి దానితో వానిని చంపెను.

11:24b.1CH.011.024 యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.

11:25b.1CH.011.025 ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకుల కధిపతిగా ఉంచెను.

11:26b.1CH.011.026 మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,

11:27b.1CH.011.027 హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

11:28b.1CH.011.028 తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,

11:29b.1CH.011.029 హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,

11:30b.1CH.011.030 నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

11:31b.1CH.011.031 బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,

11:32b.1CH.011.032 గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,

11:33b.1CH.011.033 బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,

11:34b.1CH.011.034 గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనా తాను,

11:35b.1CH.011.035 హరారీయుడైన శాకారు కుమారుడగు అహీ యాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

11:36b.1CH.011.036 మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,

11:37b.1CH.011.037 కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,

11:38b.1CH.011.038 నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,

11:39b.1CH.011.039 అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,

11:40b.1CH.011.040 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

11:41b.1CH.011.041 హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,

11:42b.1CH.011.042 రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,

11:43b.1CH.011.043 మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,

11:44b.1CH.011.044 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీ యేలు,

11:45b.1CH.011.045 షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,

11:46b.1CH.011.046 మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,

11:47b.1CH.011.047 ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.

12

12:1b.1CH.012.001 దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీ యులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.

12:2b.1CH.012.002 వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు.

12:3b.1CH.012.003 వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,

12:4b.1CH.012.004 ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను,గెదేరాతీ యుడైన యోజాబాదు,

12:5b.1CH.012.005 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,

12:6b.1CH.012.006 కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,

12:7b.1CH.012.007 గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.

12:8b.1CH.012.008 మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.

12:9b.1CH.012.009 వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,

12:10b.1CH.012.010 నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,

12:11b.1CH.012.011 ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,

12:12b.1CH.012.012 ఎనిమిదవ వాడు యోహానాను, తొమి్మదవవాడు ఎల్జాబాదు,

12:13b.1CH.012.013 పదియవవాడు యిర్మీయా,పదకొండవవాడు మక్బన్నయి.

12:14b.1CH.012.014 గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్య ధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,

12:15b.1CH.012.015 యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.

12:16b.1CH.012.016 మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.

12:17b.1CH.012.017 దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెనుమీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.

12:18b.1CH.012.018 అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడైదావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమా ధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక,నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధి పతులుగా చేసెను.

12:19b.1CH.012.019 సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతో కూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబం ధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీ యులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణ హాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.

12:20b.1CH.012.020 అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి.

12:21b.1CH.012.021 వారందరును పరాక్రమ శాలులును సైన్యాధిపతులునై యుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయముచేసిరి.

12:22b.1CH.012.022 దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చు చుండిరి.

12:23b.1CH.012.023 యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా

12:24b.1CH.012.024 యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధసన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.

12:25b.1CH.012.025 షిమ్యోనీయులలో యుద్ధ మునకు తగినశూరులు ఏడువేల నూరుమంది.

12:26b.1CH.012.026 లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.

12:27b.1CH.012.027 అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది.

12:28b.1CH.012.028 పరాక్రమశాలియైన సాదోకు అను ¸°వనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.

12:29b.1CH.012.029 సౌలు సంబంధులగు బెన్యా మీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.

12:30b.1CH.012.030 తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.

12:31b.1CH.012.031 మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.

12:32b.1CH.012.032 ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.

12:33b.1CH.012.033 జెబూలూ నీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.

12:34b.1CH.012.034 నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనిన వారు ముప్పది యేడువేలమంది.

12:35b.1CH.012.035 దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.

12:36b.1CH.012.036 ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.

12:37b.1CH.012.037 మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.

12:38b.1CH.012.038 ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియ మింపవలెనని కోరియుండిరి.

12:39b.1CH.012.039 వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్న పానములు పుచ్చుకొనిరి.

12:40b.1CH.012.040 ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదల మీదను ఎద్దుల మీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱలను పశువులను విస్తార ముగా తీసికొనివచ్చిరి.

13

13:1b.1CH.013.001 దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను... అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను

13:2b.1CH.013.002 ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి

13:3b.1CH.013.003 మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.

13:4b.1CH.013.004 ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.

13:5b.1CH.013.005 కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.

13:6b.1CH.013.006 కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.

13:7b.1CH.013.007 వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి; ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి.

13:8b.1CH.013.008 దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి.

13:9b.1CH.013.009 వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయిచాపగా

13:10b.1CH.013.010 యెహోవా కోపము అతనిమీద రగులుకొనెను, అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను.

13:11b.1CH.013.011 యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్‌1 ఉజ్జా అని పేరు.

13:12b.1CH.013.012 ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొందిదేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును

13:13b.1CH.013.013 తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయు డైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.

13:14b.1CH.013.014 దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.

14

14:1b.1CH.014.001 తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెను.

14:2b.1CH.014.002 తన జనులగు ఇశ్రా యేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీ యులమీద రాజుగాస్థిరపరచెనని దావీదు గ్రహించెను.

14:3b.1CH.014.003 పమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తె లను కనెను.

14:4b.1CH.014.004 యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను

14:5b.1CH.014.005 ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు

14:6b.1CH.014.006 నోగహు నెపెగు యాఫీయ

14:7b.1CH.014.007 ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.

14:8b.1CH.014.008 దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబ డెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను.

14:9b.1CH.014.009 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి.

14:10b.1CH.014.010 ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవాపొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెల విచ్చెను.

14:11b.1CH.014.011 వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసిజలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము2 అను పేరుపెట్టెను.

14:12b.1CH.014.012 వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను.

14:13b.1CH.014.013 ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా

14:14b.1CH.014.014 దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడునీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి

14:15b.1CH.014.015 కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి యున్నాడని తెలిసికొనుమని సెల విచ్చెను.

14:16b.1CH.014.016 దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబి యోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి.

14:17b.1CH.014.017 కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనుల కందరికి కలుగజేసెను.

15

15:1b.1CH.015.001 దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు... కట్టించెను; దేవుని మందస మునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.

15:2b.1CH.015.002 మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పివారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.

15:3b.1CH.015.003 అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.

15:4b.1CH.015.004 అహరోను సంతతివారిని

15:5b.1CH.015.005 లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,

15:6b.1CH.015.006 మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,

15:7b.1CH.015.007 గెర్షోను సంతతివారికధిపతియగు యోవే లును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,

15:8b.1CH.015.008 ఎలీషాపాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని,

15:9b.1CH.015.009 హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని

15:10b.1CH.015.010 ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమి్మనా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.

15:11b.1CH.015.011 అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమీ్మనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.

15:12b.1CH.015.012 లేవీయుల పితరుల సంతతులకుమీరు పెద్దలై యున్నారు.

15:13b.1CH.015.013 ఇంతకుముందు మీరు ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.

15:14b.1CH.015.014 అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.

15:15b.1CH.015.015 తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి.

15:16b.1CH.015.016 అంతట దావీదుమీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.

15:17b.1CH.015.017 కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,

15:18b.1CH.015.018 వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహులనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.

15:19b.1CH.015.019 పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.

15:20b.1CH.015.020 జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.

15:21b.1CH.015.021 మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.

15:22b.1CH.015.022 లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడై నందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.

15:23b.1CH.015.023 బెరెక్యాయును ఎల్కానాయును మందస మునకు ముందునడుచు కావలివారుగాను

15:24b.1CH.015.024 షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియ మింపబడిరి.

15:25b.1CH.015.025 దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.

15:26b.1CH.015.026 యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడె లను ఏడు గొఱ్ఱపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.

15:27b.1CH.015.027 దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని యుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.

15:28b.1CH.015.028 ఇశ్రాయేలీయులందరును ఆర్బా éటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.

15:29b.1CH.015.029 యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.

16

16:1b.1CH.016.001 ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని... వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

16:2b.1CH.016.002 దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి

16:3b.1CH.016.003 పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను.

16:4b.1CH.016.004 మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయ నకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియ మించెను.

16:5b.1CH.016.005 వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.

16:6b.1CH.016.006 బెనాయా యహజీయేలు అను యాజ కులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.

16:7b.1CH.016.007 ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా

16:8b.1CH.016.008 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.ఆయన నామమును ప్రకటనచేయుడిఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.

16:9b.1CH.016.009 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడిఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.

16:10b.1CH.016.010 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతో షించుదురు గాక.

16:11b.1CH.016.011 యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి.

16:12b.1CH.016.012 ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారాఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా

16:13b.1CH.016.013 ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి కొనుడిఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.

16:14b.1CH.016.014 ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.

16:15b.1CH.016.015 మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగానుకనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని

16:16b.1CH.016.016 ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను

16:17b.1CH.016.017 ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.

16:18b.1CH.016.018 వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెల విచ్చెను.

16:19b.1CH.016.019 యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.

16:20b.1CH.016.020 వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండిరాజ్యమునకును తిరుగులాడుచుండగా

16:21b.1CH.016.021 నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి

16:22b.1CH.016.022 ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.

16:23b.1CH.016.023 సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.

16:24b.1CH.016.024 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములనుప్రచురించుడి.

16:25b.1CH.016.025 యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.

16:26b.1CH.016.026 జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.

16:27b.1CH.016.027 ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.

16:28b.1CH.016.028 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.

16:29b.1CH.016.029 యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొనిఆయనయెదుట సాగిలపడుడి.

16:30b.1CH.016.030 భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.

16:31b.1CH.016.031 యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక

16:32b.1CH.016.032 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.

16:33b.1CH.016.033 భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.

16:34b.1CH.016.034 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.

16:35b.1CH.016.035 దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.

16:36b.1CH.016.036 మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.

16:37b.1CH.016.037 అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని

16:38b.1CH.016.038 యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను

16:39b.1CH.016.039 గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

16:40b.1CH.016.040 ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.

16:41b.1CH.016.041 యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.

16:42b.1CH.016.042 బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతము లను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను.మరియు యెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.

16:43b.1CH.016.043 తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటి వారిని దీవించుటకై వారియొద్దకు పోయెను.

17

17:1b.1CH.017.001 దావీదు తన యింట నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించినేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా

17:2b.1CH.017.002 నాతానుదేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయుమని దావీదుతో అనెను.

17:3b.1CH.017.003 ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

17:4b.1CH.017.004 నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాస మునకై యొక ఆలయము కట్టించుట నీచేతకాదు.

17:5b.1CH.017.005 ఇశ్రా యేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని.

17:6b.1CH.017.006 నేను ఇశ్రా యేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయుమీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట కుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞా పించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితో నైనను నేనొక మాటయైన పలికియుంటినా?

17:7b.1CH.017.007 కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగాసైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడునీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱల దొడ్డినుండి తీసికొని

17:8b.1CH.017.008 నీవువెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని; లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగ జేయుదును

17:9b.1CH.017.009 మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లును, నా జనులైన ఇశ్రాయేలీయులమీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు;

17:10b.1CH.017.010 నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియు గాకయెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.

17:11b.1CH.017.011 నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను.

17:12b.1CH.017.012 అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.

17:13b.1CH.017.013 నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను.

17:14b.1CH.017.014 నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము.

17:15b.1CH.017.015 నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాట లన్నిటిని దావీదునకు తెలియజేయగా

17:16b.1CH.017.016 రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెనుదేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు లోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది?

17:17b.1CH.017.017 దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మను ష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చి యున్నావు.

17:18b.1CH.017.018 నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడ నైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు.

17:19b.1CH.017.019 యెహోవా నీ దాసుని నిమి త్తమే నీ చిత్తప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.

17:20b.1CH.017.020 యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.

17:21b.1CH.017.021 నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి

17:22b.1CH.017.022 నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహో వావైన నీవు వారికి దేవుడవై యున్నావు

17:23b.1CH.017.023 యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక.

17:24b.1CH.017.024 ఇశ్రా యేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక.

17:25b.1CH.017.025 దేవానీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియ జేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను.

17:26b.1CH.017.026 యెహోవా, నీవు దేవుడవైయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు.

17:27b.1CH.017.027 ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వ దించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును.ఇదియైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి,

18

18:1b.1CH.018.001 వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.

18:2b.1CH.018.002 అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.

18:3b.1CH.018.003 సోబా రాజైన హదరెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి

18:4b.1CH.018.004 అతని యొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయిం చెను.

18:5b.1CH.018.005 సోబారాజైన హదరెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరి యనులలో ఇరువదిరెండు వేలమందిని హతముచేసెను.

18:6b.1CH.018.006 తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.

18:7b.1CH.018.007 మరియు హదరెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.

18:8b.1CH.018.008 హదరెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులో నుండియు, కూనులోనుండియు దావీదు బహు విస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువు లను చేయించెను.

18:9b.1CH.018.009 దావీదు సోబారాజైన హదరెజెరుయొక్క సైన్య మంతటిని ఓడించిన వర్తమానము హమాతురాజైనతోహూకు వినబడెను.

18:10b.1CH.018.010 హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములుపలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.

18:11b.1CH.018.011 ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్దనుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.

18:12b.1CH.018.012 మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.

18:13b.1CH.018.013 దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకు లైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.

18:14b.1CH.018.014 ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగిం చెను.

18:15b.1CH.018.015 సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతియై యుండెను; అహీలూదు కుమారుడైన యెహోషా పాతు రాజ్యపుదస్తావేజులమీద నుండెను;

18:16b.1CH.018.016 అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;

18:17b.1CH.018.017 యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై యుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.

19

19:1b.1CH.019.001 ఇదియైన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు... చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను.

19:2b.1CH.019.002 అప్పుడు దావీదుహానూను తండ్రియైన నాహాషు నా యెడల దయ చూపించెను గనుక నేను అతనికుమారుని యెడల దయ చూపెదనని యనుకొని, అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు

19:3b.1CH.019.003 అమ్మోనీయుల యధి పతులు హానూనుతోనిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకేగదా అతని సేవకులు నీయొద్దకు వచ్చియున్నారు అని మనవి చేయగా

19:4b.1CH.019.004 హానూను దావీదు సేవకులను పట్టుకొని, వారిని గొరిగించి, వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను.

19:5b.1CH.019.005 ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి; వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపిమీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమాన మంపెను.

19:6b.1CH.019.006 అమ్మోనీయులు దావీదునకు తమయందు అసహ్యము పుట్టించితిమని తెలిసికొనినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహరయీము నుండియు, సిరియా మయకానుండియు సోబానుండియు రథములను గుఱ్ఱపురౌతులను రెండువేల మణుగుల వెండిఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి.

19:7b.1CH.019.007 ముప్పది రెండువేల రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మయకారాజును అతని జనులను కుదుర్చుకొనిరి; వీరు వచ్చి మేదెబా ముందరితట్టున దిగిరి, అమ్మోనీయులు తమతమ పట్టణములలోనుండి కూడుకొని యుద్దముచేయుటకు వచ్చిరి.

19:8b.1CH.019.008 దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలుల నందరిని పంపెను.

19:9b.1CH.019.009 అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి.

19:10b.1CH.019.010 తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడి యుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి,

19:11b.1CH.019.011 కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను

19:12b.1CH.019.012 సిరియనుల బలమునకు నేను నిలువ లేకపోయినయెడల నీవు నాకు సహాయము చేయవలెను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయినయెడల నేను నీకు సహాయము చేయుదును.

19:13b.1CH.019.013 ధైర్యము కలిగియుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము; యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక.

19:14b.1CH.019.014 ఆ ప్రకారము యోవాబును అతనితో కూడ నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువ లేక అతని యెదుటనుండి తిరిగి పారిపోయిరి.

19:15b.1CH.019.015 సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషైముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి, యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను.

19:16b.1CH.019.016 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలిసికొనినప్పుడు వారు దూతలను పంపి,యేటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి, హదరెజెరుయొక్క సైన్యాధిపతియైన షోపకు వారికి నాయకుడాయెను.

19:17b.1CH.019.017 దావీదు ఆ సంగతి తెలిసికొని ఇశ్రా యేలీయులనందరిని సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారియెదుట సైన్యములను వ్యూహపరచెను, దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి.

19:18b.1CH.019.018 అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువక తిరిగి పారి పోయిరి;దావీదు సిరియనులలో ఏడువేల రథికులను నలుబది వేల కాల్బలమును హతముచేసి సైన్యాధిపతియైన షోపకును చంపి వేసెను.

19:19b.1CH.019.019 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదరెజెరుయొక్క సేవకులు తెలిసికొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటినుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సులేక యుండిరి.

20

20:1b.1CH.020.001 మరుసటి యేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమ కూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను.

20:2b.1CH.020.002 దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసి కొనెను; దాని యెత్తు రెండు మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను, దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములోనుండి తీసికొనిపోయెను.

20:3b.1CH.020.003 దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్ళతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేము నకు తిరిగివచ్చిరి.

20:4b.1CH.020.004 అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.

20:5b.1CH.020.005 మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది.

20:6b.1CH.020.006 మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు.

20:7b.1CH.020.007 వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను.

20:8b.1CH.020.008 గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి.

21

21:1b.1CH.021.001 తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా... లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా

21:2b.1CH.021.002 దావీదు యోవాబునకును జనులయొక్క అధి పతులకునుమీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను.

21:3b.1CH.021.003 అందుకు యోవాబురాజా నా యేలిన వాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక;వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవిచేసెను.

21:4b.1CH.021.004 అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను.

21:5b.1CH.021.005 ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు పదకొండు లక్షల మందియు యూదా వారిలో కత్తి దూయువారు నాలుగు లక్షల డెబ్బదివేల మందియు సంఖ్యకు వచ్చిరి.

21:6b.1CH.021.006 రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.

21:7b.1CH.021.007 ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.

21:8b.1CH.021.008 దావీదునేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా

21:9b.1CH.021.009 యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి దావీ దుతో ఇట్లనుము.

21:10b.1CH.021.010 యెహోవా సెలవిచ్చునదేమనగామూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును.

21:11b.1CH.021.011 కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను

21:12b.1CH.021.012 మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువ లేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచిం చుము.

21:13b.1CH.021.013 అందుకు దావీదునేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడు దును గాక అని గాదుతో అనెను.

21:14b.1CH.021.014 కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.

21:15b.1CH.021.015 యెరూషలే మును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతోచాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెల వియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను.

21:16b.1CH.021.016 దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యా కాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా

21:17b.1CH.021.017 దావీదుజనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండ కుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను.

21:18b.1CH.021.018 యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా

21:19b.1CH.021.019 యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.

21:20b.1CH.021.020 ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితో కూడనున్న అతని నలుగురు కుమారు లును దాగుకొనిరి.

21:21b.1CH.021.021 దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.

21:22b.1CH.021.022 ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా

21:23b.1CH.021.023 ఒర్నానురాజైన నా యేలినవాడు దాని తీసికొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక; ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి; ఇదియంతయు నేనిచ్చెదనని దావీదుతో అనెను.

21:24b.1CH.021.024 రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి

21:25b.1CH.021.025 ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.

21:26b.1CH.021.026 పిమ్మటదావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.

21:27b.1CH.021.027 యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.

21:28b.1CH.021.028 యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను

21:29b.1CH.021.029 మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.

21:30b.1CH.021.030 దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడినవాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ల లేకుండెను.

22

22:1b.1CH.022.001 మరియుదేవుడైన యెహోవా నివాసస్థలము ఇదే... యని ఇశ్రాయేలీయులర్పించు దహనబలులకు పీఠము ఇదేయని దావీదు సెలవిచ్చెను.

22:2b.1CH.022.002 తరువాత దావీదు ఇశ్రా యేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను.

22:3b.1CH.022.003 వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని

22:4b.1CH.022.004 ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయు లును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.

22:5b.1CH.022.005 నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను.

22:6b.1CH.022.006 తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

22:7b.1CH.022.007 మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా

22:8b.1CH.022.008 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి.

22:9b.1CH.022.009 నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టు ఉండు అతని శత్రు వులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్ట బడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును.

22:10b.1CH.022.010 అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.

22:11b.1CH.022.011 నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక.

22:12b.1CH.022.012 నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక.

22:13b.1CH.022.013 యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన యెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము.

22:14b.1CH.022.014 ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.

22:15b.1CH.022.015 మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసె పనివారును వడ్రవారును ఏవిధ మైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు.

22:16b.1CH.022.016 లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.

22:17b.1CH.022.017 మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతుల కందరికిని ఆజ్ఞాపించెను.

22:18b.1CH.022.018 ఎట్లనగామీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలన తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చి యున్నాడుగదా? దేశనివాసులను ఆయన నాకు వశపరచి యున్నాడు, యెహోవా భయమువలనను ఆయన జనుల భయమువలనను దేశము లోపరచబడియున్నది.

22:19b.1CH.022.019 కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందస మును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామముకొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి.

23

23:1b.1CH.023.001 దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.

23:2b.1CH.023.002 మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.

23:3b.1CH.023.003 అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.

23:4b.1CH.023.004 వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను,ఆరు వేలమంది అధి పతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.

23:5b.1CH.023.005 నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.

23:6b.1CH.023.006 గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.

23:7b.1CH.023.007 లద్దాను కుమారులు ముగ్గురు;

23:8b.1CH.023.008 పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు

23:9b.1CH.023.009 షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.

23:10b.1CH.023.010 యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.

23:11b.1CH.023.011 యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమా రులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.

23:12b.1CH.023.012 కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.

23:13b.1CH.023.013 అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధ మైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యే కింపబడిరి.

23:14b.1CH.023.014 దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.

23:15b.1CH.023.015 మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.

23:16b.1CH.023.016 గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

23:17b.1CH.023.017 ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.

23:18b.1CH.023.018 ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.

23:19b.1CH.023.019 హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు,యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.

23:20b.1CH.023.020 ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.

23:21b.1CH.023.021 మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.

23:22b.1CH.023.022 ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.

23:23b.1CH.023.023 మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.

23:24b.1CH.023.024 వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.

23:25b.1CH.023.025 ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు

23:26b.1CH.023.026 లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.

23:27b.1CH.023.027 దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.

23:28b.1CH.023.028 వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,

23:29b.1CH.023.029 సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,

23:30b.1CH.023.030 అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.

23:31b.1CH.023.031 సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు,

23:32b.1CH.023.032 యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.

24

24:1b.1CH.024.001 అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.

24:2b.1CH.024.002 నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.

24:3b.1CH.024.003 దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.

24:4b.1CH.024.004 వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.

24:5b.1CH.024.005 ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.

24:6b.1CH.024.006 లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.

24:7b.1CH.024.007 మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు,

24:8b.1CH.024.008 మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు,

24:9b.1CH.024.009 అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,

24:10b.1CH.024.010 ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,

24:11b.1CH.024.011 తొమి్మదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,

24:12b.1CH.024.012 పండ్రెండవది యాకీమునకు,

24:13b.1CH.024.013 పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,

24:14b.1CH.024.014 పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,

24:15b.1CH.024.015 పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,

24:16b.1CH.024.016 పందొమి్మదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,

24:17b.1CH.024.017 ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,

24:18b.1CH.024.018 ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.

24:19b.1CH.024.019 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.

24:20b.1CH.024.020 శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,

24:21b.1CH.024.021 రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,

24:22b.1CH.024.022 ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,

24:23b.1CH.024.023 హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,

24:24b.1CH.024.024 ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,

24:25b.1CH.024.025 ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,

24:26b.1CH.024.026 మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.

24:27b.1CH.024.027 యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.

24:28b.1CH.024.028 మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.

24:29b.1CH.024.029 కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.

24:30b.1CH.024.030 మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.

24:31b.1CH.024.031 వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.

25

25:1b.1CH.025.001 మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు... హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా

25:2b.1CH.025.002 ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అష ర్యేలా అనువారు.

25:3b.1CH.025.003 యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.

25:4b.1CH.025.004 హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.

25:5b.1CH.025.005 వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను.

25:6b.1CH.025.006 వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.

25:7b.1CH.025.007 యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.

25:8b.1CH.025.008 తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.

25:9b.1CH.025.009 మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.

25:10b.1CH.025.010 మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:11b.1CH.025.011 నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:12b.1CH.025.012 అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:13b.1CH.025.013 ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:14b.1CH.025.014 ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.

25:15b.1CH.025.015 ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:16b.1CH.025.016 తొమి్మదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:17b.1CH.025.017 పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:18b.1CH.025.018 పదకొండవది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:19b.1CH.025.019 పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:20b.1CH.025.020 పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:21b.1CH.025.021 పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:22b.1CH.025.022 పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:23b.1CH.025.023 పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:24b.1CH.025.024 పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:25b.1CH.025.025 పదునెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:26b.1CH.025.026 పందొమి్మదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.

25:27b.1CH.025.027 ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:28b.1CH.025.028 ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:29b.1CH.025.029 ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.

25:30b.1CH.025.030 ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25:31b.1CH.025.031 ఇరువది నాలుగవది రోమమీ్తయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

26

26:1b.1CH.026.001 ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు...కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.

26:2b.1CH.026.002 మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,

26:3b.1CH.026.003 ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై యేడవవాడు.

26:4b.1CH.026.004 దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజా బాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు,

26:5b.1CH.026.005 అమీ్మయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.

26:6b.1CH.026.006 వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరా క్రమ శాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.

26:7b.1CH.026.007 షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.

26:8b.1CH.026.008 ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమా రులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.

26:9b.1CH.026.009 మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది.

26:10b.1CH.026.010 మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను,

26:11b.1CH.026.011 రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.

26:12b.1CH.026.012 ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమసహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాల కులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియ మింపబడిరి.

26:13b.1CH.026.013 చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.

26:14b.1CH.026.014 తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,

26:15b.1CH.026.015 ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.

26:16b.1CH.026.016 షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచు టకు చీటి పడెను.

26:17b.1CH.026.017 తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును,దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,

26:18b.1CH.026.018 బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.

26:19b.1CH.026.019 కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.

26:20b.1CH.026.020 కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.

26:21b.1CH.026.021 లద్దాను కుమారులను గూర్చినదిగెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమ పితరుల యిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది.

26:22b.1CH.026.022 యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు.

26:23b.1CH.026.023 అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.

26:24b.1CH.026.024 మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.

26:25b.1CH.026.025 ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.

26:26b.1CH.026.026 యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును

26:27b.1CH.026.027 యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి.

26:28b.1CH.026.028 దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.

26:29b.1CH.026.029 ఇస్హారీయులనుగూర్చినదివారిలో కెన న్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.

26:30b.1CH.026.030 హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమ శాలులును వేయిన్ని యేడు వందల సంఖ్యగలవారు, వీరు యొర్దాను ఈవల పడమటి వైపుననుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పనివిషయములోను పైవిచా రణకర్తలుగా నియమింపబడిరి.

26:31b.1CH.026.031 హెబ్రోనీయులను గూర్చి నది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమ శాలులుగా కనబడిరి.

26:32b.1CH.026.032 పరాక్రమశాలులగు వాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటి పెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబే నీయుల మీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను.

27

27:1b.1CH.027.001 జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటి .పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.

27:2b.1CH.027.002 మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేల మంది యుండిరి.

27:3b.1CH.027.003 పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.

27:4b.1CH.027.004 రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:5b.1CH.027.005 మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:6b.1CH.027.006 ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పది మందికి అధిపతియై యుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమీ్మజాబాదు ఉండెను.

27:7b.1CH.027.007 నాలుగవనెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:8b.1CH.027.008 అయిదవ నెలను ఇశ్రాహే తీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:9b.1CH.027.009 ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:10b.1CH.027.010 ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:11b.1CH.027.011 ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడునుహుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:12b.1CH.027.012 తొమి్మదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:13b.1CH.027.013 పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:14b.1CH.027.014 పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగ ములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:15b.1CH.027.015 పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

27:16b.1CH.027.016 మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,

27:17b.1CH.027.017 కెమూ యేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను.

27:18b.1CH.027.018 దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,

27:19b.1CH.027.019 ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధి పతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,

27:20b.1CH.027.020 అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారు డైన యోవేలు అధిపతిగా ఉండెను,

27:21b.1CH.027.021 గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపువారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహశీయేలు అధిపతిగా ఉండెను,

27:22b.1CH.027.022 దానీయు లకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు.

27:23b.1CH.027.023 ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.

27:24b.1CH.027.024 జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.

27:25b.1CH.027.025 రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.

27:26b.1CH.027.026 పొలములో పనిచేయువారిమీదను, భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింప బడెను.

27:27b.1CH.027.027 ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.

27:28b.1CH.027.028 షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్‌ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.

27:29b.1CH.027.029 షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి.

27:30b.1CH.027.030 ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీ యుడైన యెహెద్యాహును నియమింపబడిరి.

27:31b.1CH.027.031 గొఱ్ఱల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజుకున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు.

27:32b.1CH.027.032 దావీదు పినతండ్రియైన యోనాతాను వివేకముగల ఆలోచనకర్తయై యుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను, హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారులయొద్ద ఉండుటకు నియమింపబడెను.

27:33b.1CH.027.033 అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు.

27:34b.1CH.027.034 అహీతోపెలు చనిపోయినమీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యా తారును మంత్రులైరి; యోవాబు రాజుయొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.

28

28:1b.1CH.028.001 గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు... సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తిమీదను స్థిరాస్తిమీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని రాజునొద్ద నున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమ శాలులనందరిని రాజగు దావీదు యెరూష లేమునందు సమకూర్చెను.

28:2b.1CH.028.002 అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెనునా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి; యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించ వలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని.

28:3b.1CH.028.003 అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినవాడవు గనుక నీవు నా నామ మునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను.

28:4b.1CH.028.004 ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునై యుండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు.

28:5b.1CH.028.005 యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసి యున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను

28:6b.1CH.028.006 నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.

28:7b.1CH.028.007 మరియు నేటిదినమున చేయుచున్నట్లు అతడు ధైర్యమువహించి నా ఆజ్ఞలను నా న్యాయవిధులను అనుసరించినయెడల, నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును.

28:8b.1CH.028.008 కాబట్టి మీరు ఈ మంచిదేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీ సంతతివారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్ప గించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.

28:9b.1CH.028.009 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.

28:10b.1CH.028.010 పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.

28:11b.1CH.028.011 అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడ మునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును

28:12b.1CH.028.012 వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కస ములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.

28:13b.1CH.028.013 మరియు యాజకులును లేవీయులును సేవచేయవలసిన వంతుల పట్టీ యును, యెహోవా మందిరపు సేవనుగూర్చిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికప్పగించెను.

28:14b.1CH.028.014 మరియు ఆయా సేవాక్రమ ములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తుప్రకారము బంగారమును, ఆ యా సేవాక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతని కప్పగించెను.

28:15b.1CH.028.015 బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదెలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమి దెలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారము గాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక దీపస్తంభమునకును, దాని దాని ప్రమిదెలకును కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,

28:16b.1CH.028.016 సన్నిధిరొట్టెలు ఉంచు ఒక్కొక బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకా రముగాను, వెండిబల్లలకు కావలసినంత వెండిని,

28:17b.1CH.028.017 ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,

28:18b.1CH.028.018 ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగార మును అతని కప్పగించెను.

28:19b.1CH.028.019 ఇవియన్నియు అప్పగించియెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పని యంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొ మోనుతో చెప్పెను.

28:20b.1CH.028.020 మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగానీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడ కుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవను గూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును.

28:21b.1CH.028.021 దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకా రము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పని యంతటిని నెరవేర్చుటకై ఆ యా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధి పతులును జనులందరును నీకు సహాయులగుదురు.

29

29:1b.1CH.029.001 రువాత రాజైన దావీదు సర్వసమాజముతో... ఈలాగు సెలవిచ్చెనుదేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.

29:2b.1CH.029.002 నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.

29:3b.1CH.029.003 మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

29:4b.1CH.029.004 గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను

29:5b.1CH.029.005 ఈ దినమునయెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?

29:6b.1CH.029.006 అప్పుడు పితరుల యిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధి పతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి

29:7b.1CH.029.007 మనఃపూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.

29:8b.1CH.029.008 తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవామందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.

29:9b.1CH.029.009 వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.

29:10b.1CH.029.010 రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెనుమాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.

29:11b.1CH.029.011 యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.

29:12b.1CH.029.012 ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.

29:13b.1CH.029.013 మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.

29:14b.1CH.029.014 ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి యున్నాము.

29:15b.1CH.029.015 మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు

29:16b.1CH.029.016 మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది.

29:17b.1CH.029.017 నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.

29:18b.1CH.029.018 అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయ పూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.

29:19b.1CH.029.019 నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయ చేయుము.

29:20b.1CH.029.020 ఈలాగు పలికిన తరువాత దావీదుఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.

29:21b.1CH.029.021 తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱ పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.

29:22b.1CH.029.022 ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.

29:23b.1CH.029.023 అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహా సనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.

29:24b.1CH.029.024 అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.

29:25b.1CH.029.025 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదు టను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీ యులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.

29:26b.1CH.029.026 యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.

29:27b.1CH.029.027 అతడు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.

29:28b.1CH.029.028 అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.

29:29b.1CH.029.029 రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,

29:30b.1CH.029.030 దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.


Holder of rights
Multilingual Bible Corpus

Citation Suggestion for this Object
TextGrid Repository (2025). Telugu Collection. 1 Chronicles (Telugu). 1 Chronicles (Telugu). Multilingual Parallel Bible Corpus. Multilingual Bible Corpus. https://hdl.handle.net/21.11113/0000-0016-BDAA-4